అప్పుడు ఇనుము.. ఇప్పుడు వెండి..

Published on Thu, 01/22/2026 - 13:47

ప్రఖ్యాత ఇన్వెస్టర్‌, ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి విలువైన లోహాలపై మరోసారి తన అభిప్రాయాలను వెల్లడించారు. ఈసారి ఆయన బంగారంతో పోలిస్తే వెండికే భవిష్యత్తులో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు.

సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్టులో.. వేల సంవత్సరాలుగా బంగారం, వెండి రెండూ డబ్బుగా ఉపయోగంలో ఉన్నాయని గుర్తు చేసిన కియోసాకి, నేటి టెక్నాలజీ యుగంలో వెండి ఒక “స్ట్రక్చరల్ మెటల్”గా మారిందని అన్నారు. పారిశ్రామిక విప్లవ కాలంలో ఇనుము ఎంత కీలకమో, ఈ టెక్ యుగంలో వెండి అంతే కీలకమని పోలుస్తూ రాసుకొచ్చారు.

“వెండి ఇక కేవలం డబ్బు మాత్రమే కాదు. ప్రపంచ ఆర్థిక భవిష్యత్తుకు అత్యంత అవసరమైన లోహంగా మారుతోంది” అని కియోసాకి (Robert Kiyosaki) పేర్కొన్నారు.

ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి రంగాల్లో వెండి వినియోగం వేగంగా పెరుగుతోంది. పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగం విస్తరిస్తుండటంతో వెండికి డిమాండ్ మరింత పెరుగుతుందనేది ఆయన అభిప్రాయం.

ధరల విషయానికి వస్తే, 1990లో వెండి ధర ఔన్స్‌కు సుమారు 5 డాలర్లు  ఉండేదని, 2026 నాటికి అది సుమారు 92 డాలర్లకి చేరిందని కియోసాకి చెప్పారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే, 2026లోనే వెండి ఔన్స్‌కు 200 డాలర్ల వరకు చేరవచ్చని ఆయన అంచనా వేశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)