Breaking News

కియోసాకి వెండినంతా అమ్మేసుకున్నాడా?

Published on Wed, 01/28/2026 - 13:26

ప్రసిద్ద ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకికి బంగారం, వెండిపై పెట్టుబడులంటే ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. అయితే తాను వెండిని మొత్తం అమ్మి బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టానన్న వార్తలు వచ్చాయని, వాటిని ఖండించారు. అవి పూర్తిగా అసత్య ప్రచారాలు అని ఆయన స్పష్టం చేశారు.

దీని గురించి రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా ‘ఎక్స్‌’లో ఒక పోస్టు చేశారు. వాంకూవర్‌లో జరిగిన ఇన్వెస్టర్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఈ రూమర్ల గురించి తెలుసుకున్నానని కియోసాకి తెలిపారు. తన పెట్టుబడి వ్యూహంలో వెండికి ఇప్పటికీ ముఖ్యమైన స్థానం ఉందని, తాను ఒక్క గ్రాము వెండికూడా అమ్మలేదని చెప్పారు.

అయితే, తన కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి కొంత బిట్‌కాయిన్, తరువాత కొంత బంగారం అమ్మినట్లు ఆయన అంగీకరించారు. ఆ నిర్ణయం పెద్ద తప్పు అని, ఇప్పుడు వెనక్కి చూసుకుంటే వాటిని అమ్మకపోయి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ‘దేవుడి దయ వల్ల వెండి మాత్రం అమ్మలేదు’ అన్నారు.

కియోసాకి తన పెట్టుబడి తత్వాన్ని మరోసారి వివరించారు. అప్పు ఉపయోగించి పాజిటివ్ క్యాష్ ఫ్లో వచ్చే రియల్ ఎస్టేట్ కొనుగోలు చేసి, ఆ ఆదాయంతో బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఈథీరియం వంటి ఆస్తులను కొనుగోలు చేస్తానని చెప్పారు.

అమెరికన్ డాలర్ వంటి ఫియాట్ కరెన్సీలపై తనకు నమ్మకం లేదని పునరుద్ఘాటించిన కియోసాకి, “నకిలీ డాలర్లను అమ్మి నిజమైన ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం” అని పెట్టుబడిదారులకు సూచించారు.

ద్రవ్యోల్బణం, ప్రభుత్వ అప్పులు, ఆర్థిక అస్థిరతలపై కియోసాకి గతంలోనూ పలు హెచ్చరికలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో విలువైన లోహాలు, క్రిప్టోకరెన్సీలు రక్షణాత్మక పెట్టుబడులుగా ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయం.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)