Breaking News

కియోసాకి ఆందోళన: జాగ్రత్త పడండి!

Published on Sat, 10/25/2025 - 21:13

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. పెట్టుబడులకు సంబంధించిన విషయాలను వెల్లడించే రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత.. రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) తాజాగా మరో ట్వీట్ చేశారు. ఇందులో పాత ఆలోచన vs కొత్త ఆలోచన అంటూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

నా ఆందోళన అని మొదలు పెట్టిన కియోసాకి పాత ఆలోచన vs కొత్త ఆలోచన అని చెబుతూ.. ధనిక మరియు పేద మధ్య అంతరం ఇలా అవుతుందని వివరించారు. పాత ఆలోచనాపరులు, కొత్త ఆలోచనాపరులు ఎలా ఆలోచిస్తారనే విషయాన్ని స్పష్టం చేశారు.

పాత ఆలోచనాపరులు
1: పాఠశాలకు తిరిగి వెళ్లండి
2: మరింత కష్టపడి పని చేయండి
3: నకిలీ డబ్బును ఆదా చేయండి
4: పదవీ విరమణ ప్రణాళికలో పెట్టుబడి పెట్టండి

కొత్త ఆలోచనాపరులు
1: సొంత స్టార్టప్ ప్రారంభించండి
2: నిజమైన బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఎథెరియంను ఆదా చేయండి

పాత ఆలోచనలతో వెనుకపడిపోకండి. కొత్తగా ఆలోచించండి. మీ ఆలోచనలు ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి అని కియోసాకి పేర్కొన్నారు. ఎథెరియం, బిట్‌కాయిన్‌ వంటి వాటిలో పెట్టే పెట్టుబడులు మిమ్మల్ని ధనవంతులను చేస్తాయని అన్నారు. జాగ్రత్త వహించండి అంటూ.. తన సందేశాన్ని ముగించారు.

ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి

డబ్బును పొదుపుచేస్తే.. దాని విలువ ఎప్పటికీ పెరగదు. కాబట్టి మీరు బంగారం, వెండి వంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే.. దాని విలువ భవిష్యత్తులో తప్పకుండా పెరుగుతుంది. మిమ్మల్ని ధనవంతులను చేస్తుందని.. కియోసాకి చాన్నాళ్ల నుంచి చెబుతూనే ఉన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)