Breaking News

ఉద్యోగం కంటే.. అదే అవసరం: కియోసాకి సలహా..

Published on Sun, 01/04/2026 - 15:06

రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. ''ఉద్యోగ భద్రత కోసం పాఠశాలకు వెళ్లడం ఎందుకు పాత ఆలోచన'' అంటూ ఒక ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఒకప్పుడు బాగా చదివితే.. మంచి ఉద్యోగం వచ్చేది.. జీవితాంతం భద్రత ఉంటుందనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఎంత పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నా.. ఎప్పుడు జాబ్ నుంచి తీసేస్తారో తెలియదు. ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగం చేసే వ్యక్తులకైనా.. ఊహకందని విధంగా లేఆఫ్ నోటీసులు వచ్చిన సందర్భాలు కోకొల్లలు.

2025లో కంపెనీలు తొలగించిన ఉద్యోగులు
➤యూపీఎస్: 48,000 ఉద్యోగాలు
➤అమెజాన్: 30,000 ఉద్యోగాలు
➤ఇంటెల్: 20,000 ఉద్యోగాలు
➤వెరిజోన్: 15,000 ఉద్యోగాలు
➤మైక్రోసాఫ్ట్: 6,000 ఉద్యోగాలు
➤సేల్స్‌ఫోర్స్: 4,000 ఉద్యోగాలు
➤జీఎం: 3,420 ఉద్యోగాలు
➤ఐబీఎం: 2,700 ఉద్యోగాలు
➤బోయింగ్: 2,500 ఉద్యోగాలు
➤వాల్‌మార్ట్: 1,500 ఉద్యోగాలు

ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో చాలావరకు హైటెక్ కంపెనీలే ఉన్నాయి. ఇంకెక్కడ ఉద్యోగ భద్రత ఉంది. ఉద్యోగం కంటే.. మీ ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోండి. డబ్బు ఆదా చేయవద్దు. దీనికి బదులుగా బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం వంటిని ఆదా చేయడి. అవే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయని కియోసాకి పేర్కొన్నారు.

ఇక్కడ కియోసాకి భావన ఏమిటంటే.. ఇంతపెద్ద ప్రైవేట్ కంపెనీ అయినా మీకు ఉద్యోగ భద్రత కల్పించదు. కాబట్టి ఉద్యోగంపై మాత్రమే ఆధారపడకుండా.. డబ్బు ఎలా పనిచేస్తుంది అన్న జ్ఞానం పెంచుకోండి. “డబ్బు సేవ్ చేయకండి” అని ఎందుకు అంటున్నారంటే.. డబ్బును బ్యాంకులో డబ్బు ఉంచితే విలువ తగ్గిపోతుందని (ద్రవ్యోల్బణం వల్ల) కియోసాకి అభిప్రాయం. కాబట్టి డబ్బును నేరుగా సేవ్ చేసుకోకుండా.. విలువ పెంచే వస్తువులలో పెట్టుబడిగా పెట్టాలి.

ఇదీ చదవండి: అంబానీ ఫ్యామిలీ: ఎవరెంత చదువుకున్నారంటే..

ఉద్యోగ భద్రత కోసం పాఠశాలకు వెళ్లడం ఎందుకు పాత ఆలోచన అనే విషయానికి వస్తే.. దీని అర్థం చదువు అవసరం లేదు అని కాదు. ధనవంతులు అవ్వడానికి కేవలం చదువే సరిపోతుంది అన్న ఆలోచనకు సంబంధించింది. అంటే.. చదువుతో పాటు, డబ్బు నిర్వహణపై అవగాహన కూడా అవసరం. అప్పుడే సంపన్నులవుతారు.

Videos

సాక్షి ఫోటోగ్రాఫర్ పై తప్పుడు కేసు.. బుద్ధి చెప్పిన కోర్ట్

భయపడకు నేనున్నా.. వైఎస్ జగన్ ను కలిసిన నల్లజర్ల పోలీసు బాధితులు

తాజా రాజకీయ పరిణామాలపై నేడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్

ఎన్ని ప్రాణాలు పోయినా.. ఐ డోంట్ కేర్! నాకు భూములు కావాల్సిందే!!

అడ్డగోలు దోపిడీ.. సంక్రాంతికి ట్రావెల్స్ టికెట్ బాంబు

టీడీపీ గూండాలు చేసిన అరాచకాలను వైఎస్ జగన్ కు వివరించిన బొమ్మనహాళ్ ఎంపీటీసీలు

లిఫ్ట్ ఇరిగేషన్ పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. ప్రెస్ మీట్ లో నోరు విప్పని చంద్రబాబు

చిరు కోసం బాబీ మాస్టర్ ప్లాన్..! అదే నిజమైతే..

ఖబర్దార్ బాబు... ఎన్ని కేసులు పెట్టినా నిలదీస్తూనే ఉంటాం....

తెలంగాణ సీఎం రేవంత్ కామెంట్స్ పై నోరువిప్పని సీఎం చంద్రబాబు

Photos

+5

రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

పూల స్కర్ట్‌లో ఆహా అనేలా జాన్వీ కపూర్ (ఫొటోలు)

+5

సీరియల్ బ్యూటీ విష్ణుప్రియ క్యూట్ మెమొరీస్ (ఫొటోలు)

+5

మాయాబజార్ సావిత్రి లుక్‌లో యాంకర్ సుమ (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో కలిసి కరీనా కపూర్ ఫారిన్ ట్రిప్‌ (ఫొటోలు)

+5

‘కార్ల్టన్ వెల్నెస్’ బ్రాండ్‌ అంబాసిడర్‌గా మృణాల్‌ (ఫొటోలు)

+5

తిరుమలలో హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ (ఫొటోలు)

+5

కొత్త సంవత్సరం కొత్త కొత్తగా హీరోయిన్ కృతి శెట్టి (ఫొటోలు)

+5

ఆది సాయికుమార్ ‘శంబాల’ సినిమా థ్యాంక్స్‌ మీట్‌ (ఫొటోలు)

+5

మాదాపూర్ లో సందడి చేసిన క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ (ఫొటోలు)