చెప్పినవే చేస్తాను.. విజేతగా మారాలంటే?

Published on Sun, 11/30/2025 - 17:58

రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత, అమెరికన్ వ్యాపారవేత్త 'రాబర్ట్ కియోసాకి'.. ఎప్పటికప్పుడు పెట్టుబడికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా.. మనీ టిప్ 2 పేరుతో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా ఎలా ఉండాలో అనే విషయం గురించి పేర్కొన్నారు.

కియోసాకి తన ట్వీట్ ప్రారంభంలో.. 100 డాలర్లకు ఎంత కొంటారు? అని చెబుతూ.. 1900లో వంద డాలర్లకు, ఎనిమిది నెలలకు సరిపోయే సామాగ్రి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి దిగజారిపోయింది అన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా ఎలా ఉండాలంటే.. ఓడిపోయేవారిగా ఉండటం మానేయండని పేర్కొన్నారు.

ఓడిపోయినవారు ఎప్పుడూ పాత ఆలోచనలు పట్టుకుంటారు. విజేతలా ఆలోచించడం ప్రారంభించండి. డబ్బును పట్టుకోవడం మానేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినప్పుడు విజేతగా మారండి. 1996లో ప్రచురించబడిన రిచ్ డాడ్ పూర్ డాడ్‌లో.. నేను “పొదుపు చేసేవారు ఓడిపోతారు” అని హెచ్చరించాను.

ఇదీ చదవండి: 'ప్రపంచం పేదరికంలో ఉన్నా.. మీరు ధనవంతులు కావచ్చు'

నేను చెప్పేవాటినే పాటిస్తుంటాను. నేను 1965 నుండి వెండిని ఆదా చేస్తున్నాను. 1972 నుండి బంగారం, 2019 నుంచి బిట్‌కాయిన్. 2023 నుంచి ఎథీరియం ఆదా చేస్తున్నానని కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇటీవల నేను నా 4.5 మిలియన్ డాలర్ల ఇంటిని 2000లో కొనుగోలు చేసిన 4,50,000 డాలర్ల బంగారంతో కొనుగోలు చేసానని అన్నారు. త్వరలో టిప్ 3 వస్తుంది అని ట్వీట్ ముగించారు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)