వెండి ధర ఇంకా ఎంత పెరుగుతుందంటే..?

Published on Tue, 02/10/2026 - 14:57

బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. ప్రముఖ ఇన్వెస్టర్‌, ప్రసిద్ధ 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా ఒక ట్వీట్ చేశారు. ఇందులో తాను 600 సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చారు.

ఇటీవల నేను మరో 600 యూఎస్ సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేశాను. ఈ రోజు వెండి స్పాట్ ధర ఒక ఔన్సుకు 82 డాలర్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను గమనిస్తే, భవిష్యత్తులో వెండి ధర మరింత పెరిగే అవకాశం ఉందని నా నమ్మకం. ముఖ్యంగా 2026లో వెండి ధర ఒక్క ఔన్సుకు 200 డాలర్లకు చేరుకోవచ్చు, లేదా దానికంటే కూడా ఎక్కువ కావచ్చు అని నేను భావిస్తున్నాను.

ఇప్పటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికన్ డాలర్ స్థితి ఆందోళనకరంగా మారుతోంది. అధిక రుణాలు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల డాలర్ విలువ క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కాగితపు కరెన్సీ (ఫియట్ కరెన్సీ)పై మాత్రమే ఆధారపడే వారు భవిష్యత్తులో నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఫియట్ కరెన్సీ విలువ అనేది.. కేవలం ప్రభుత్వ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. కానీ వెండి, బంగారం వంటి విలువైన లోహాలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. ఇవి ద్రవ్యోల్బణం నుంచి సంపదను కాపాడే సాధనాలుగా పని చేస్తాయి. అందుకే కరెన్సీ విలువ తగ్గుతున్న సమయంలో నిజమైన ఆస్తులైన.. వెండి వంటి లోహాల్లో పెట్టుబడి పెట్టడం తెలివైన నిర్ణయం అని కియోసాకి పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో ఆర్థిక అస్థిరత మరింత పెరిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కేవలం డబ్బును దాచుకునేవారి కంటే.. నిజమైన విలువ ఉన్న ఆస్తుల్లో (బంగారం, వెండి మొదలైనవి) పెట్టుబడి పెట్టినవారే లాభపడతారు. ఈ విషయాన్ని గమనించి, భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తగా ఉండండి, అని కియోసాకి ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: బంగారం ధర.. ఒక్కసారిగా ఎందుకు పెరిగిందంటే?

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కియోసాకి ఒకేసారి 600 యూఎస్ సిల్వర్ ఈగల్స్ కొనుగోలు చేయడంతో.. వెండి రేటు తప్పకుండా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. కాగా.. ఇండియన్ మార్కెట్లో కూడా వెండి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ.. నేడు (ఫిబ్రవరి 10) కేజీ రేటు రూ.3 లక్షలకు చేరుకుంది. అంటే ఒక గ్రాము 300 రూపాయలన్నమాట. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)