'డబ్బు ఆదా చేయొద్దు.. పేదవారవుతారు': రాబర్ట్ కియోసాకి

Published on Sun, 05/25/2025 - 17:23

అతిపెద్ద మార్కెట్ క్రాష్ జరగబోతోంది, ఆర్ధిక సంక్షోభం రాబోతోంది, బంగారం రూ.21 లక్షలకు చేరుతుందని చెప్పిన రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి' తాజాగా చాలా మంది ప్రజలు పేదలుగా ఎందుకు మిగిలిపోతున్నారో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

రాబర్ట్ కియోసాకి రెండు ఆర్థిక సూత్రాలను ''గ్రేషమ్స్ లా, మెట్‌కాల్ఫ్ లా'' గురించి వివరిస్తూ.. ప్రజలు పేదవారు కావడానికి కారణాలను చెప్పారు. 'డబ్బును పొదుపు చేసేవారు ఓడిపోతారు' అని పేర్కొన్నారు.

గ్రేషమ్స్ లా ప్రకారం.. 'చెడు డబ్బు వ్యవస్థలోకి ప్రవేశించినప్పుడు.. మంచి డబ్బు దాగిపోతుంది'. ఎలా అంటే యూఎస్ డాలర్ లేదా భారతీయ రూపాయి వంటివి కాలక్రమేణా విలువను కోల్పోయే అవకాశం ఉంది. నిజమైన డబ్బును ఆదా చేయాలంటే.. బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టండి.

మెట్‌కాల్ఫ్ లా అనేది.. నెట్‌వర్క్స్. దీనికి ఉదాహరణగా ''మెక్‌డొనాల్డ్స్ ఒక ఫ్రాంచైజ్ నెట్‌వర్క్. మామ్ పాప్ బర్గర్స్ అనేది కాదు. ఫెడెక్స్ ఒక నెట్‌వర్క్. జో వన్-ట్రక్ డెలివరీ అనేది కాదు'' అని కియోసాకి వివరిస్తూ.. నేను బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడతాను ఎందుకంటే అది ఒక నెట్‌వర్క్.. అయితే చాలా క్రిప్టోలు కాదని అన్నారు. మీరు ధనవంతులు కావాలనుకుంటే.. చట్టాలను పాటించండి అని కియోసాకి చెప్పారు.

ఇదీ చదవండి: 'బంగారం రూ.21 లక్షలకు చేరుతుంది': రాబర్ట్ కియోసాకి అంచనా..

''వస్తువులలో మాత్రమే పెట్టుబడి పెట్టండి, ధనవంతుడు మీ నుంచి కొనుగోలు చేస్తాడు'' అనే మైఖేల్ సాయిలర్ మాటలను రాబర్ట్ కియోసాకి వెల్లడించారు. నేను యూఎస్ డాలర్లను ఆదా చేయను, ఎందుకంటే పొదుపు అనేది గ్రేషమ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తుంది. అలాగే నేను నెట్‌వర్క్‌లు లేని చెత్త నాణేలలో పెట్టుబడి పెట్టను, ఎందుకంటే అవి మెట్‌కాల్ఫ్ చట్టాన్ని ఉల్లంఘిస్తాయి. అందుకే నేను బంగారం, వెండి, బిట్‌కాయిన్‌ల మీదనే పెట్టుబడి పెడతాను. అయితే ఈ చట్టాలని పాటించాలంటే జాగ్రత్త కూడా వహించాలని ఆయన అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)