Breaking News

తక్కువ ధరలతో రిలయన్స్‌ కొత్త ఫ్యాషన్‌ బ్రాండ్‌.. తొలి స్టోర్‌ హైదరాబాద్‌లోనే..

Published on Fri, 08/25/2023 - 14:20

రిలయన్స్ రిటైల్ లిమిటెడ్ ( Reliance Retail Ltd ) వ్యాల్యూ అపరెల్‌ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఇప్పటికే ప్రసిద్ధి చెందిన టాటా జూడియో ( Tata Zudio ) చైన్, ల్యాండ్‌మార్క్ గ్రూప్ యాజమాన్యంలోని మ్యాక్స్, షాపర్స్ స్టాప్‌కు చెందిన ఇక్‌ ట్యూన్‌కి పోటీగా కొత్త బ్రాండ్ యూస్టా ( Yousta )ని ప్రారంభించింది.

అన్ని ఉత్పత్తులు రూ. 999 లోపే
సమకాలీన టెక్-ఎనేబుల్డ్ స్టోర్ లేఅవుట్‌లతో, యువ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సరసమైన ధరలకు యూస్టా హై ఫ్యాషన్‌ ఉత్పత్తులను అందిజేస్తుందని కంపెనీ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ స్టోర్‌లో అన్ని ఉత్పత్తులు రూ. 999 కంటే తక్కువ ధరకే లభిస్తాయి. అందులోనూ ఎక్కువ భాగం రూ. 499 కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంచడం విశేషం.

హైదరాబాద్‌లో తొలి స్టోర్‌
రిలయన్స్‌ యూస్టా తమ తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో ప్రారంభించింది. యూస్టా స్టోర్‌లను అనేక టెక్ టచ్ పాయింట్‌లను అమర్చారు. క్యూఆర్‌ స్క్రీన్‌లు, సెల్ఫ్‌-చెక్‌అవుట్ కౌంటర్‌లు, కాంప్లిమెంటరీ వైఫై, ఛార్జింగ్ స్టేషన్‌లు ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ యూస్టా ఉత్పత్తులను అజియో ( Ajio ), జియో మార్ట్‌ ( JioMart ) ద్వారా కూడా ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేయవచ్చు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)