Breaking News

జియో సినిమాపై రిలయన్స్‌ కీలక నిర్ణయం

Published on Sat, 04/15/2023 - 21:34

నెట్‌ఫ్లిక్స్, వాల్‌డిస్నీ వంటి గ్లోబల్ స్ట్రీమింగ్ ప్లాట్‌పామ్స్‌కు చెక్‌ పెట్టేందుకు రిలయన్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారంతో పాపులారిటీ పొందిన జియో సినిమాను లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌గా మార్చడానికి కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా జియో సినిమా యాప్‌లోకి 100కి పైగా సినిమాలు, టీవీ సిరీస్‌లు అందుబాటులోకి తేనున్నది. తద్వారా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. 

ఈ సందర్భంగా రిలయన్స్ మీడియా కంటెంట్ బిజినెస్ ప్రెసిడెంట్ జ్యోతి దేశ్ పాండే మాట్లాడుతూ.. ఐపీఎల్ ద్వారా జియో సినిమా యాప్‌కు వచ్చిన ఆదరణ కొనసాగించడానికి జియో సినిమా యాప్‌లో కొత్త కంటెంట్ జత చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లను జియో యాప్ ద్వారా ఉచితంగా ప్రేక్షకులు.. కొత్త కంటెంట్ జత చేశాక చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించామన్నారు. అయితే ఎంత చార్జీ వసూలు చేయాలన్న విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. 

మరోవైపు వచ్చేనెల 28తో ఐపీఎల్ మ్యాచ్‌లు ముగియనున్నాయి. అప్పటికల్లా కొత్త కంటెంట్ యాడ్ చేయాలని రిలయన్స్ భావిస్తున్నట్లు జ్యోతి దేశ్ పాండే తెలిపారు. జియో సినిమా యాప్‌లో కొత్త కంటెంట్ మీద వీక్షకులందరికీ అందుబాటు ధరలో చార్జీ విధిస్తామన్నారు.  
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)