Konda Surekha: వాళ్లని చిత్తు చిత్తుగా కొడతా..
Breaking News
రూ.100 కంటే తక్కువ.. జియో రీఛార్జ్ ప్లాన్స్!
Published on Tue, 09/29/2026 - 16:09
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరసమైన రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంటుంది. ఈ కథనంలో రూ.100 కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉన్న రెండు రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.
రూ.55 ప్లాన్
జియో తన ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కేవలం రూ.55కే ఒక ప్రత్యేక టీవీ వోచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా తక్కువ ధరలోనే ప్రీమియం లైవ్ టీవీ ఛానళ్లను చూడవచ్చు. అయితే.. ఇది సాధారణ రీచార్జ్ ప్లాన్ కాదు. ఎందుకంటే.. ఈ వోచర్‌ను ఉపయోగించాలంటే ఇప్పటికే యాక్టివ్‌లో ఉన్న ఒక బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ తప్పనిసరిగా ఉండాలి. బేస్ ప్లాన్ లేకపోతే ఈ వోచర్ పనిచేయదు.
రూ.55 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. అయితే దీని ద్వారా 10ఎంబీ డేటా మాత్రమే లభిస్తుంది. డేటా పరంగా పెద్దగా ఉపయోగం లేకపోయినప్పటికీ.. టీవీ ఛానల్స్ చూడటానికి పనికొస్తుంది. జియోటీవీ యాప్‌లో 1,000కుపైగా లైవ్ టీవీ ఛానళ్లను వీక్షించవచ్చు. ఇందులో జియోస్టార్, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, సన్ టీవీ నెట్‌వర్క్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఈటీవీ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌లకు చెందిన ఛానల్స్ అందుబాటులో ఉంటాయి.
స్టార్ ప్లస్ హెచ్‌డీ, కలర్స్ హెచ్‌డీ, సోనీ సెట్ హెచ్‌డీ, సోనీ సబ్ హెచ్‌డీ వంటి ప్రముఖ ఛానళ్లను కూడా వీక్షించవచ్చు. అయితే జియోస్టార్‌కు చెందిన స్పోర్ట్స్ ఛానళ్లు ఈ ప్లాన్‌లో ఉండవు. తక్కువ ఖర్చుతో మొబైల్‌లో లైవ్ టీవీ చూడాలనుకునే జియో వినియోగదారులకు ఈ రూ.55 ప్లాన్ మంచి ఎంపిక.
రూ.77 ప్లాన్
జియో రూ.77 ప్లాన్ అందించడం వెనుక ప్రధాన ఉద్దేశం ఓటీటీ ప్రయోజనాలను అందించడమే. ఎందుకంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే కేవలం 3 జేబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఇది కూడా కేవలం 5 రోజుల వ్యాలిడిటీ మాత్రమే.
సోనీలివ్ ఓటీటీ 30 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది. సోనీలివ్ ద్వారా కంటెంట్‌ను చూడటానికి ఆసక్తి ఉన్న వినియోగదారులు జియోటీవీ యాప్ ద్వారా దానిని స్ట్రీమ్ చేసుకోవచ్చు. జియోటీవీ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది.
ఇదీ చదవండి: పిల్లలు, వృద్ధుల భద్రత కోసం జియోషీల్డ్
Tags : 1