Breaking News

జియో బంపరాఫర్.. రూ.400తో సరికొత్త ప్యాకేజ్!

Published on Mon, 08/03/2026 - 16:53

రిలయన్స్ జియో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సరికొత్త జియో హోమ్ బ్రాడ్‌బ్యాండ్ అండ్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ ప్లాన్‌లు హై-స్పీడ్ వైఫై, 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల సబ్‌స్క్రిప్షన్‌లను ఒకే ప్యాకేజీలో నెలకు రూ. 400 ప్రారంభ ధరతో అందిస్తున్నాయి.

ఈ బండిల్ ఆఫర్ ద్వారా కస్టమర్‌లు బ్రాడ్‌బ్యాండ్, టెలివిజన్ మరియు స్ట్రీమింగ్ వినోదాన్ని ఒకే కనెక్షన్ మరియు ఒకే నెలవారీ బిల్లుతో పొందవచ్చు. కేవలం టీవీ మాత్రమే చూసే వారి నుంచి హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు లైవ్ టీవీ, ఓటీటీ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి వరకు, వివిధ రకాల గృహ అవసరాలకు సరిపోయేలా ఈ ప్లాన్‌లు రూపొందించారు.

ఎంచుకున్న ప్లాన్‌ను బట్టి, కస్టమర్‌లు అన్‌లిమిటెడ్ వైఫై, 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, 200కి పైగా HD ఛానెల్‌లు.. ఆహా, జియోహాట్‌స్టార్‌, జీ5, సోనీ లివ్ వంటి వాటితో సహా 12-ప్లస్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్‌ను ఆస్వాదించవచ్చు. ఇందులో టీవీలో యూట్యూబ్, జియో సర్వీస్ ఇంజనీర్ల ద్వారా ఉచిత ఇన్‌స్టాలేషన్.. మెయింటెనెన్స్, అలాగే లైవ్ టీవీని ప్లే, పాజ్ & రివైండ్ చేసే ఫీచర్లు కూడా ఉన్నాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గృహాలకు.. జియో హోమ్ తన ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా టెలివిజన్ సేవలను అందిస్తుంది. సాధారణంగా వాతావరణం బాగాలేనప్పుడు డీటీహెచ్ సేవలకు అంతరాయం కలుగుతుంది, కానీ ఫైబర్ ద్వారా ప్రతికూల వాతావరణ పరిస్థితులలోనైనా అంతరాయం లేని వీక్షణ అనుభవాన్ని జియో అందిస్తుంది. కస్టమర్‌లు లైవ్ టీవీని పాజ్ మరియు రివైండ్ చేయగల సదుపాయం ఉన్నందున, వారు తమకు ఇష్టమైన తెలుగు సీరియల్స్, సినిమాలు, లైవ్ స్పోర్ట్స్ లేదా న్యూస్ ప్రోగ్రామ్‌లను ఎప్పటికీ మిస్ అయ్యే అవకాశం లేదు.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)