Breaking News

జియో కొత్త వైఫై.. ఏకంగా 6 రెట్లు అధికంగా..

Published on Mon, 06/23/2025 - 18:10

రిలయన్స్ జియో ఏఎక్స్6000 యూనివర్సల్ రూటర్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఈ కొత్త వైఫై 6 రౌటర్ మెష్ టెక్నాలజీతో వస్తుంది. జియో ఫైబర్‌  బ్రాడ్‌ బ్యాండ్‌ సర్వీస్‌ ద్వారా అందిస్తున్న గరిష్ట ఇంటర్నెట్‌ వేగం 1000 ఎంబీపీఎస్‌ కాగా ఇది 6,000 ఎంబీపీఎస్ వరకు వేగంతో  ఇంటర్నెట్‌ను అందిస్తుంది. అంటే 6 రెట్లు అధిక వేగంతో ఇంటర్నెట్‌ను ఆనందివచ్చు. సుమారు 2,000 చదరపు అడుగుల ప్రాంతాన్ని కవర్ చేస్తుంది.  4కే స్ట్రీమింగ్, గేమింగ్‌కు బాగా సరిపోతుంది.

జియో కొత్త వైఫై రౌటర్ జీరో లాగ్ తో 100కు పైగా డివైజ్ లను హ్యాండిల్ చేస్తుందని, డేటా భద్రత కోసం డబ్ల్యూపీఏ3 సపోర్ట్ తో వస్తుందని చెబుతున్నారు. పెద్ద లేదా బహుళ అంతస్తుల ఇళ్లలో మరింత వేగవంతమైన ఇంటర్నెట్‌ కోసం ఈ రౌటర్‌ను రూపొందించారు.  ఇది ఆన్‌లైన్ గేమర్లు, బింజ్ వాచర్స్, ఎక్కువ కనెక్టెడ్ పరికరాలను వినియోగించే స్మార్ట్ హోమ్ వినియోగదారులు, పెద్ద కుటుంబాలకు అనువైనది.

కొత్త జియో ఏఎక్స్ 6000 యూనివర్సల్ రూటర్ ధర భారత్‌లో రూ.5,999. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్ గ్యాడ్జెట్లు వంటి బహుళ పరికరాలను ఒకేసారి హైస్పీడ్ ఇంటర్నెట్‌కు కనెక్ట్‌  చేసుకోవచ్చు. డ్యూయల్ బ్యాండ్ వైఫై, జియో ట్రూ ఏఐ మెష్ కవరేజ్, స్మార్ట్ హోమ్ కనెక్టివిటీ వంటి ఇతర ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ రౌటర్ ఐపీ ఓవర్‌ డీహెచ్‌సీపీ కనెక్టివిటీని మాత్రమే సపోర్ట్ చేస్తుందని, ఐపీపీఓఈ,  పీపీఓఈ కనెక్షన్ సెటప్ తో పనిచేయదని రిలయన్స్ తెలిపింది. కంపెనీ వెబ్‌సైట్‌తోపాటు ఇతర ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో ఈ రౌటర్‌ను కొనుగోలు చేయవచ్చు.

👉 జియో నుంచి 2 కొత్త ప్లాన్‌లు.. ప్రత్యేక బెనిఫిట్లు.. 👈

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)