Breaking News

జియో కొత్త రీఛార్జ్ ప్లాన్స్: 365 రోజుల వ్యాలిడిటీ కోసం..

Published on Mon, 05/12/2025 - 16:50

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల అన్ని టెలికాం ఆపరేటర్లను వినియోగదారుల ప్రయోజనం కోసం.. వాయిస్ కాలింగ్, ఎస్ఎమ్ఎస్ సేవలను కలిగి ఉన్న సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలకు ప్రతిస్పందనగా, రిలయన్స్ జియో ఎటువంటి డేటా ప్రయోజనాలను అందించకుండా.. కాలింగ్, ఎస్ఎమ్ఎస్ వంటి వాటికోసం మాత్రమే రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది.

రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన ఈ కొత్త ప్లాన్‌లు (రూ.458, రూ.1958) ప్రత్యేకంగా వాయిస్ కాల్స్ & టెక్స్ట్ మెసేజస్ వంటివి మాత్రమే అవసరమయ్యే వారికి ఉపయోగపడతాయి. అంటే ఈ ప్లాన్‌లలో డేటా లభించదు.

రూ.458 ప్లాన్
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే ఉంటుంది. వ్యాలిడిటీ సమయంలో అపరిమిత వాయిస్ కాలింగ్, 1000 ఎస్‌ఎంఎస్‌లు, నేషనల్ రోమింగ్ వంటివి లభిస్తాయి. అంతే కాకుండా.. జియో సినిమా, జియో టీవీ, జియోకు సంబంధించిన యాప్‌లను యాక్సెస్ చేయవచ్చు.

ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?

రూ. 1,958 ప్లాన్
ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాల్స్, 3,600 ఎస్‌ఎంఎస్‌లు, నేషనల్ రోమింగ్ సేవలు ఉన్నాయి. వీటితో పాటు.. వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ యాక్సెస్‌ను పొందుతారు. కొత్త ప్లాన్‌ల తీసుకొచ్చిన జియో.. రూ. 479, రూ. 1899 ప్లాన్‌లను నిలిపివేసింది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు