Breaking News

యూజర్లకు షాకిచ్చిన జియో: చౌకైన ప్లాన్ నిలిపివేత

Published on Tue, 08/19/2025 - 15:35

సాధారణంగా ఎక్కువమంది తక్కువ ధరలో.. ఎక్కువ రోజుల వ్యాలిడిటీ ఉన్న మొబైల్ రీఛార్జ్ ప్లాన్లనే ఎంచుకుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు టెలికాం కంపెనీలు సరసమైన ప్లాన్స్ ప్రవేశపెడుతున్నాయి. అయితే రిలయన్స్ జియో మాత్రం రోజుకు 1జీబీ డేటా ఇస్తున్న రూ. 249 ప్లాన్‌ను నిలిపివేసింది.

ఆగస్టు 18 నుంచి జియో తన ఎంట్రీ లెవల్ ప్లాన్ రూ. 249 (రోజుకి 1జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ)ను నిలిపివేసింది. కాబట్టి ఇప్పుడు వినియోగదారులు రూ. 299 ప్లాన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా యూజర్ రోజుకి 1.5 జీబీ డేటా పొందవచ్చు. దీని వ్యాలిడిటీ కూడా 28 రోజులే.

ఇప్పటి వరకు రూ. 249తో రీఛార్జ్ చేసుకున్న జియో యూజర్లు.. ఇకపై మరో 50 రూపాయలు వెచ్చించి రూ. 299 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త ప్లాన్ ద్వారా రోజుకి 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లు, 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. కొంత ఎక్కువ డేటా కావాలనుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపిక అవుతుంది.

ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్‌కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?

ఇది కాకుండా రూ. 189 ప్లాన్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ ద్వారా 2జీబీ డేటా, 300 ఎస్ఎమ్ఎస్‌లు, 28 రోజులపాటు అపరిమిత కాల్స్ పొందవచ్చు. డేటా అవసరం లేదు అనుకున్న యూజర్లకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే కంపెనీ 1జీబీ డేటా ఇచ్చే ప్లాన్ తిరిగి ఎప్పుడు ప్రవేశపెడుతుంది? అనే వివరాలు వెల్లడికాలేదు. బహుశా ఈ ప్లాన్ మళ్ళీ తీసుకొచ్చే అవకాశం లేదని అనిపిస్తోంది.

Videos

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

Photos

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)