Breaking News

జియో, ఎయిర్‌టెల్.. బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!

Published on Tue, 02/03/2026 - 18:16

అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం కంపెనీలు.. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు లెక్కకు మించిన రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇందులో నెల, మూడు నెలలు, ఏడాది ప్లాన్స్ ఉన్నాయి. అయితే ఈ కథనంలో 84 రోజుల పాపులర్ రీఛార్జ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్
రూ.469 ప్లాన్: కంపెనీ అందించే 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా.. అపరిమిత కాల్స్ లభిస్తాయి. అయితే డేటా లభించదు. నెంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవాలన్నా.. కేవలం కాలింగ్ కోసం మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలన్నా యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు.

రూ.548 ప్లాన్: 84 రోజుల పాటు అపరిమిత కాల్స్ మాత్రమే కాకుండా.. 7 జీబీ డేటా కూడా పొందవచ్చు. ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. డేటా ఎక్కువ కావాలనుకునే యూజర్లకు ఈ ప్లాన్ అంత ఉపయోగకరంగా ఉండదు.

రూ.979 ప్లాన్: రోజుకు 2జీబీ డేటా కావాలనుకునే యూజర్లకు ఇది బెస్ట్ ప్లాన్. 84 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు లభిస్తాయి. సోనీ లివ్ యాప్ యాక్సెస్ లభిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. మొత్తం 168 జీబీ డేటా లభిస్తుందన్నమాట.

రిలయన్స్ జియో
రూ.448 ప్లాన్: జియో అందిస్తున్న ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇందులో డేటా లభించదు. కానీ అపరిమిత కాలింగ్, 1000 ఎస్ఎంఎస్‌‌లు పొందవచ్చు. తక్కువ ఖర్చుతో కాల్స్ చేయాలకునేవారు లేదా నెంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవాలకునేవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.

రూ.799 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 84 రోజులే. అయితే రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాలింగ్ మాత్రమే కాకుండా.. రోజుకు 100 ఎస్ఎంఎస్‌‌లు పొందవచ్చు. జియో టీవీ, జియో ఎయిర్ క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌లు లభిస్తాయి.

రూ.859 ప్లాన్: రోజుకు 2 జీబీ డేటా కావాలనే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. 84 రోజుల వ్యాలిడిటీ (168 జీబీ డేటా).. మూడు నెలలు జియో హాట్‌స్టార్‌‌కు ఫ్రీ యాక్సిస్ కూడా లభిస్తుంది. అంతే కాకుండా యూజర్లు గూగుల్ జెమినీ ప్రోకు 18 నెలలు సబ్‌స్క్రిప్షన్ కూడా పొందవచ్చు.

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)