విజయ్ కి అడుగడుగునా అడ్డంకులు, గవర్నర్ తీరుపై సీపీఐ, కాంగ్రెస్ సీరియస్
Breaking News
అమెరికాలో భారత్ కంపెనీలు: ఒక్కరోజే భారీ పెట్టుబడులు!
Published on Wed, 05/06/2026 - 20:12
అమెరికాలో జరిగిన 2026 సెలెక్ట్ యూఎస్ఏ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో భారతదేశం నుంచి వచ్చిన భారీ పెట్టుబడులు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. వివిధ కంపెనీలు.. మొత్తం సుమారు 20.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను యూఎస్‌లో పెట్టడానికి సన్నద్ధమవుతున్నాయి.
''అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అమెరికాలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తిరిగి వస్తున్నాయి. భారతీయ కంపెనీలు టెక్, తయారీ, ఫార్మాస్యూటికల్స్ వంటి వివిధ రంగాలలో 20.5 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళిక వేస్తున్నాయి. ఇందులో, ఈరోజే 1.1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ప్రకటించిన 12 భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. దీని ద్వారా అమెరికాలో ఉద్యోగాలు పెరుగుతాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి వ్యాపారం చేసినప్పుడు అందరూ గెలుస్తారనడానికి ఇదే నిదర్శనం'' అని అమెరికాలో భారత రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు.
Under President Trump’s leadership investment is flowing back into the United States at record levels! Indian companies plan to invest over $20.5 billion in various sectors including tech, manufacturing, and pharmaceuticals. This includes the 12 Indian companies who announced…
— Ambassador Sergio Gor (@USAmbIndia) May 6, 2026
ఈ పెట్టుబడుల్లో అత్యధిక భాగం భారత ఫార్మా రంగం నుంచే వచ్చింది. సుమారు 19.1 బిలియన్ డాలర్లు.. అమెరికాలో తయారీ యూనిట్లు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, కొత్త ఫ్యాక్టరీల కోసం పెట్టుబడి పెట్టనున్నారు. ఇది ఔషధ రంగంలో అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలపరుస్తుంది. అదేవిధంగా ఉక్కు పరిశ్రమ, ఇంధన సరఫరా వ్యవస్థలు, కనెక్టివిటీ ప్రాజెక్టులు కూడా ఈ పెట్టుబడుల్లో భాగమయ్యాయి.
సెర్జియో గోర్ మాట్లాడుతూ.. 2030 నాటికి భారత్-అమెరికా మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్యం ద్వారా రెండు దేశాలకు సమానంగా లాభం కలిగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Tags : 1