Breaking News

ఆర్‌బీఐ ఖజానాలో బంగారం ధగధగలు

Published on Wed, 10/29/2025 - 08:56

ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు ధగధగా మెరిసిపోతున్నాయి. సెప్టెంబర్‌ చివరికి ఆర్‌బీఐ వద్ద పసిడి నిల్వలు 880.18 మెట్రిక్‌ టన్నులకు పెరిగాయి. గత 12 నెలల్లోనే 25.45 మెట్రిక్‌ టన్నుల మేర పసిడి నిల్వలను ఆర్‌బీఐ పెంచుకుంది. ఇందులో 575.82 మెట్రిక్‌ టన్నుల బంగారం దేశీయంగా నిల్వ చేసుకోగా, మిగిలినది విదేశాల్లోని వాల్టుల్లో భద్రపరిచింది.

బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వద్ద 290.37 టన్నుల బంగారం నిల్వ ఉంది. 13.99 టన్నుల మేర బంగారం డిపాజిట్ల రూపంలో కలిగి ఉంది. ఆర్‌బీఐ వద్ద విదేశీ మారకం నిల్వల్లో బంగారం వాటా 13.92 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చినాటికి ఇది 11.70 శాతంగా ఉండడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి ఆరు నెలల కాలంలో 600 కిలోల బంగారాన్ని ఆర్‌బీఐ కొనుగోలు చేసింది.

అంతర్జాతీయంగా వాణిజ్య, భౌగోళికపరమైన తీవ్ర అనిశ్చితులు నెలకొన్న తరుణంలో, డాలర్‌ రిస్క్‌ను తగ్గించుకునేందుకు  ఆర్‌బీఐ ఇటీవలి సంవత్సరాల్లో తన విదేశీ మారకం నిల్వల్లో బంగారానికి వెయిటేజీ పెంచుకోవడం గమనార్హం. సెప్టెంబర్‌ చివరికి మొత్తం విదేశీ మారకం నిల్వలు 700 బిలియన్‌ డాలర్లకు చేరాయి. సరిగ్గా ఏడాది క్రితం ఇవి 705.78 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

ఇదీ చదవండి: ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే బిజినెస్‌ ఐడియాలు

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)