ట్రంప్‌.. సంప్రదింపులా? అధికార ప్రయోగమా?

Published on Wed, 08/13/2025 - 11:28

భారత్, బ్రెజిల్ దేశాలపై యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలు ఆచరణ సాధ్యం కాదని, రాజకీయంగా ప్రమాదకరమని ప్రముఖ ఆర్థికవేత్త రఘురామ్ రాజన్ అమెరికా వాణిజ్య విధానాన్ని తీవ్రంగా విమర్శించారు. బ్రెజిల్ ఫైనాన్షియల్ పబ్లికేషన్ వాలర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజన్ మాట్లాడారు. యూఎస్‌ అనుసరిస్తున్న ఈ చర్య దీర్ఘకాలిక దౌత్య, ఆర్థిక సంబంధాలను దెబ్బతీసేలా ఉందని చెప్పారు.

అమెరికా వ్యతిరేకిగా ముద్ర

రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను కొనసాగిస్తున్నందుకు శిక్షగా పేర్కొంటూ ట్రంప్ ఇటీవల భారీ సుంకాలను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో బ్రిక్స్ సభ్యదేశమైన బ్రెజిల్‌పై ట్రంప్ ‘అమెరికా వ్యతిరేకి’గా ముద్ర వేసి ఇలాంటి సుంకాలు విధించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్, ప్రస్తుతం చికాగో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రఘురామ్‌ రాజన్ ఈ విధానాన్ని తీవ్రంగా విమర్శించారు.

యూఎస్‌కు భారత్‌ భయపడితే..

‘తలకు తుపాకీ గురిపెట్టి వాణిజ్య సంప్రదింపులు జరపడం కష్టం. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇవి వాణిజ్య సంప్రదింపులు కావు. అధికార ప్రయోగం. ఇండియా ఈ విషయంలో సుదీర్ఘ చర్చలు కోరుకుంది. అందుకు భిన్నంగా అకస్మాత్తుగా దాడి చేయడం సరికాదు. రష్యా నుంచి భారత్‌ చేసే చమురు కొనుగోళ్లపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఇలా సుంకాలతో బయపెట్టాలనుకోవడం తగదు. ఈ తీరు రాజకీయ ప్రతిఘటనను సృష్టిస్తుంది. రష్యా నుంచి కొనుగోళ్లను నిలిపివేయాలని భారత్‌ నిర్ణయం తీసుకుంటే అమెరికా ఒత్తిడికి తలొగ్గినట్లు అవుతుంది. ఇది ప్రజాస్వామ్యంలో చెడు సంకేతాలకు దారితీస్తుంది’ అన్నారు.

ఇదీ చదవండి: తగ్గి తగ్గనట్లు తగ్గిన బంగారం ధర!

యూఎస్‌కు కూడా నష్టమే..

‘అమెరికా అనుసరిస్తున్న దూకుడు సుంకాల వల్ల ఆర్థిక పతనం ఏకపక్షంగా ఉండదు. అమెరికాకు 80 బిలియన్ డాలర్ల వరకు భారత ఎగుమతులు లాభసాటిగా ఉండవు. ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం కలిగిన యాపిల్‌ వంటి సంస్థల ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 50 శాతం సుంకాలు భరించడం భారత్‌కు మాత్రమే కాదు, వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుందని భావిస్తున్న అమెరికాకు కూడా సాధ్యం కాదు. ఈ విషయాలను ప్రజలు చాలా కాలం గుర్తుంచుకుంటారు. యూఎస్‌ నేడు ఒక దేశంపై, రేపు మరో దేశంపై 50 శాతం సుంకాలు విధిస్తూపోతే అనిశ్చితి వాణిజ్యం, పెట్టుబడులకు విఘాతం కలుగుతుంది’ అని రాజన్‌ హెచ్చరించారు.

Videos

YSR ఫ్లెక్సీలు చింపేసిన దుండగులు.. కూకట్‌పల్లి లో YSRCP ఆందోళన

42 ఉద్యోగ సంఘాలకు లేఖ రాసిన ఏపీ JAC అమరావతి

Srinivasulu Reddy: కొడుకు కోసం మరీ ఇంత దిగజారుతావా..?

ఆపరేషన్ ‘రాటెన్ యాపిల్’.. న్యూయార్క్‌లో వేలాది మంది వలసదారుల అరెస్ట్

స్పోర్ట్స్ కోటాలో DSC అక్రమాలు బట్టబయలు..

బాబు పబ్లిసిటీపై YS జగన్ ఆగ్రహం

దారుణం చీకటిలోకి నేపాల్..నెక్స్ట్ స్టెప్ ఏంటి..?

ఢిల్లీలో YSR అవార్డ్స్-2026 ప్రదానోత్సవం

జీవీఎంసీ మేయర్ సీటుపై కూటమిలో పీఠముడి

మెదక్ లో కాంగ్రెస్ పాలిటిక్స్

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)