Breaking News

యూకే కంపెనీ కొనుగోలు చేసిన హైదరాబాద్ సంస్థ

Published on Mon, 11/11/2024 - 17:09

హైదరాబాద్‌కు చెందిన రఘు వంశీ గ్రూప్.. ఆయిల్ అండ్ గ్యాస్ పరిశ్రమకు విడిభాగాలను అందించే యూకేకు చెందిన ప్రముఖ ప్రెసిషన్ మెషినింగ్ కంపెనీ 'పీఎంసీ గ్రూపు'ను కొనుగోలు చేసింది.

పీఎంసీ గ్రూపు కొనుగోలుతో.. రఘు వంశీ గ్రూపు కీలకమైన పరిశ్రమలకు ఉత్పత్తులు సరఫరా చేయనుంది. కాబట్టి కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా తన ఉనికిని నిరూపించుకోగలుగుతుంది. అంతే కాకుండా ఆయిల్ & గ్యాస్ రంగంలో లేటెస్ట్ ఇంజనీరింగ్ పరిష్కారాలను అందిస్తుంది.

పీఎంసీ గ్రూపు.. త‌న‌ ప్రిసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలలో 35 సంవత్సరాలకు పైగా ఉన్న గొప్ప అనుభవం కలిగి ఉంది. ఈ కంపెనీ ఎస్ఎల్‌బీ, బేకర్ హ్యూస్, హాలీబర్టన్, ఎక్స్‌ప్రో, టెక్ ఎఫ్ఎంసీ, వన్ సబ్ సీ వంటి గ్లోబల్ ఆయిల్ & గ్యాస్ ఓఈఎంల‌కు కావాల్సిన ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఈ కంపెనీలో సుమారు 100 మంది ఉద్యోగులను కలిగి ఉన్నట్లు.. ఆదాయం రూ. 180 కోట్లు వరకు ఉంటుందని సమాచారం.

పీఎంసీ గ్రూపును.. రఘు వంశీ గ్రూప్ కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యూకే డిప్యూటీ హైకమిషనర్ గారెత్ వైన్ ఓవెన్, తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ‌ల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పీఏ, మిధాని సీఎండీ డాక్టర్ ఎస్ కే ఝా, ఏఆర్‌సీఐ సైంటిస్ట్ డాక్టర్ ఎల్.రామకృష్ణ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా రఘువంశీ గ్రూప్ ఎండీ వంశీ వికాస్ మాట్లాడుతూ.. రఘువంశీ కుటుంబంలోకి పీఎంసీ గ్రూపును స్వాగతించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కొనుగోలు ఇప్పుడు మా ఉత్ప‌త్తి బలాలను, సునిశిత మెషీనింగ్‌లో పీఎంసీ గ్రూపువారి నైపుణ్యంతో మిళితం చేస్తుంది. దీనివ‌ల్ల మా అంత‌ర్జాతీయ ఉనికిని విస్తరించడానికి, అత్యంత సునిశిత ఉత్ప‌త్తుల విస్తృత విభాగాన్ని రూపొందించ‌డానికి సాయ‌ప‌డుతుంద‌ని మేము సంతోషిస్తున్నామన్నారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)