Breaking News

బ్లూచిప్స్‌లో లాభాల స్వీకరణ

Published on Wed, 05/21/2025 - 01:17

ముంబై: అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో స్టాక్‌ సూచీలు మంగళవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్‌ 873 పాయింట్లు పతనమై 81,186 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 261పాయింట్లు కోల్పోయి 24,684 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాల్లో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆటో, ఫైనాన్స్, రక్షణ రంగ షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు చోటు చేసుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 906 పాయింట్లు క్షీణించి 81,154 వద్ద, నిఫ్టీ 275 పాయింట్లు కోల్పోయి 24,670 వద్ద కనిష్టాన్ని తాకాయి.

భారీ పతనంతో మంగళవారం ఒక్కరోజే రూ.5.64 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం విలువ రూ.438 లక్షల కోట్లకు దిగివచ్చింది. 
⇒  డాలర్‌ మారకంలో రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 85.58 వద్ద స్థిరపడింది.

పతనం ఎందుకంటే...
⇒ ఆపరేషన్‌ సిందూర్‌ కాల్పులవిరమణ తర్వాత సూచీలు అనూహ్యంగా 4% లాభపడ్డాయి.   భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. 

⇒ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెట్టాయి. భారత్‌లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. 
⇒ వరుస కొనుగోళ్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రేతలుగా మారారు. అనూహ్యంగా మే 19న  డీఐఐలూ అమ్మకాలకు పాల్పడ్డారు.  మంగళవారం ఎఫ్‌ఐఐలు రూ.10,016 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)