Breaking News

ఐటీ రిటర్నుకు సిద్ధంకండి.. బ్యాంకు అకౌంట్లు విశ్లేషించండి..

Published on Mon, 04/14/2025 - 10:57

ఏప్రిల్‌లో అడుగుపెట్టామంటే రెండు ఆలోచనలు వస్తాయి. మొదటిది 2025 మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి  సంబంధించి రిటర్నులు దాఖలు చేయడానికి సిద్ధమవడం. రెండోది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) పన్ను ప్రణాళికలను తయారు చేసుకోవడం. అందరూ కొత్త విధానానికి మొగ్గుచూపుతున్న పరిస్థితుల్లో పెట్టుబడులు/సేవింగ్స్‌పరంగా ప్లానింగ్‌కి తక్కువ అవకాశాలున్నాయి. అందుకని 2025 ఆర్థిక సంవత్సరానికి రిటర్ను వేయడానికి ఎలా సిద్ధంగా ఉండాలో తెలుసుకుందాం.  

1. మీకున్న అన్ని బ్యాంకుల ఖాతాలకు సంబంధించి స్టేట్‌మెంట్లు/పాస్‌బుక్స్‌లని అప్‌డేట్‌ చేయించండి. 
2. ప్రతి బ్యాంకు అకౌంట్‌ సేట్ట్‌మెంటుని తెచ్చుకొండి. 
3. గత ఆర్థిక సంవత్సరం తొలి రోజు (1.4.2024) నుంచి చివరి రోజు (31.3.2025) వరకు బ్యాంకులోని జమలు పరిశీలించండి.

పతి జమకు వివరణ రాసుకొండి. అంటే నగదు ద్వారా, చెక్కు ద్వారా, బదిలీ ద్వారా, గూగుల్‌ ద్వారా వచ్చిందా? మీరే స్వయంగా నగదు డిపాజిట్‌ చేసారా అని తెలుకొండి. ఆదాయమా.. అప్పు తీసుకున్నారా..? మీకు ఎవరైనా అప్పు చెల్లించారా? డివిడెండా.. వడ్డీనా .. జీతమా.. ఇంటి కిరాయా .. వ్యాపార ఆదాయమా.. షేర్ల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయమా? క్యాపిటల్‌ గెయిన్స్‌ ద్వారా వచ్చిన ఆదాయమా.. స్థిరాస్తి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయమా? పీఎఫ్‌ విత్‌డ్రా ద్వారా వచ్చినదా.. ఎన్‌ఎస్‌సీ లేదా ఎల్‌ఐసీ పాలసీ మెచ్యూరిటీ ద్వారా వచ్చినది డిపాజిట్‌ చేశారా..? అలాగే చిట్‌ఫండ్‌ పాట ద్వారా వచ్చిందా? మన కుటుంబ సభ్యులు పంపించారా.., మన దేశం నుంచి వచ్చిందా.., విదేశాల నుంచి వచ్చిందా అనే దానిపై కచ్చితమైన అవగాహన ఉండాలి.

వీటిలో కొన్నింటిపై పన్ను ఉంటుంది. కొన్ని పన్ను భారానికి గురికావు. కొన్ని ఆదాయ పరిధిలోకి వస్తాయి. కొన్నింటికి మినహాయింపు ఉంటుంది. ఇవి నిర్ధారించాలంటే మనకు ఎవరిచ్చారో కచ్చితంగా తెలియాలి. ఇచ్చిన వ్యక్తి పేరు, చిరునామా, పాన్‌ నెంబర్‌ సిద్ధంగా ఉంచుకోవాలి. దేని నిమిత్తం వచ్చిందో రాసుకోవాలి. ప్రతిదానికి రుజువులు ఉండాలి. ఇలా అన్ని అకౌంట్లలో అన్ని జమలకు వివరణ ఉండాలి. ఎందుకంటే ఈ వివరణ మీదే మీ పన్ను భారం ఆధారపడి ఉంటుంది.  

ఇక రెండవ సైడు ... రెండో కాలమ్‌.. ఖర్చు కాలమ్‌. డెబిట్‌లోని పద్దులు/ఎంట్రీలు .. ఈ వ్యవహారాలు కూడా చాలా ముఖ్యమైనవి. ఇవి ఖర్చులే కదా అని అశ్రద్ధ వహించకండి. ఖర్చులు/డెబిట్‌లు మీ ఆదాయాన్ని నిర్ధారిస్తాయి. ఉదాహరణకు ఆదాయానికి మించిన ఖర్చులుంటే వాటికి తగిన ‘మార్గాలు’ లేకపోయినా .. లేదా మీరు ఇవ్వకపోయినా ఆ ఖర్చును ఆదాయంగా భావిస్తారు. ఖర్చు దేని మీద చేసారు? ఏ నిమిత్తం చేసారు అనేది మీకు డెబిట్‌. మరో అకౌంట్లో జమ అంటే క్రెడిట్‌. అది మీకు ఆదాయం కాదంటే, అటువైపు వ్యక్తికి ఆదాయం కావచ్చు/కాకపోవచ్చు. దీన్ని నిరూపించాలి.

అంటే ఈ మేరకు మీరు స్వయంగా ‘కన్ఫర్మ్‌’ చేయాలి. అందుకని డెబిట్‌ను విశ్లేషించండి. కొన్ని చెల్లింపుల్లో ఆదాయపన్ను చట్టప్రకారం మీరే బాధ్యులుగా ఉంటారు. ఉదాహరణకు మీరు జీతం ఇస్తారనుకుందాం... టీడీఎస్‌ తీసేశారా (కట్‌ చేశారా).., కమీషన్‌ ఇస్తే టాక్స్‌ రికవరీ చేశారా.., షేర్లు కొంటే వాటి మీద డివిడెండ్‌ ఎంత? ఎవరికైనా అప్పు ఇస్తే వడ్డీ వచ్చిందా, ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తే దాని మీద ఆదాయమెంత, ఏవైనా స్థిరాస్తులు కొంటే దాని మీద ఆదాయమెంత? ఈ స్థిరాస్తి కొనేందుకు ఎంత అయ్యింది? ఎలా ఖర్చు పెట్టారు .. సోర్స్‌ ఏమిటి? ఇలా ప్రతి బ్యాంకు అకౌంటులో జమలు/ఖర్చులు విశ్లేషించాలి. వివరణలు రాసుకోవాలి.

 

పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.com కు ఈ–మెయిల్‌ పంపించగలరు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)