Breaking News

భారతీయులకు శుభవార్త, 38 దేశాలకు చేరిన పోస్టల్‌ సేవలు..తాజాగా..

Published on Mon, 07/03/2023 - 11:53

భారత్‌కు చెందిన పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ కెనడా ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు జరిగాయి. ఈ ఒప్పందంతో భారతీయులు స్థానిక పోస్టాఫీస్‌ల నుంచి కెనడాకు పార్శిళ్లను పంపుకోవచ్చు. ఇంటర్నేషనల్‌ ట్రాక్డ్‌ ప్యాకెట్‌ సర్వీస్‌ (ITPS) పేరుతో  కార్యకలాపాలు జూన్‌ 30 నుంచి ప్రారంభమయ్యాయి. 

కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం.. భారతీయులు నిర్వహించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) యూనిట్లు, చిన్న వ్యాపారాలు లేదంటే తయారు చేసిన వస్తువుల్ని, వారి వ్యాపారాల్ని మరింత విస్తరించేందుకు వీలుగా లేదంటే వ్యాపారాల్ని కెనడాకు సైతం సులభంగా ఎగుమతి చేసుకునేందుకు వీలుగా భారత్‌ - కెనడా ప్రభుత్వాలు ఈ కొత్త సర్వీసుల్ని రూపొందించాయి. తద్వారా ఎగుమతిదారుల సరిహద్దు షిప్పింగ్ అవసరాలు తీరిపోనున్నాయి. భారత్‌ ఇప్పటికే ఐటీపీఎస్‌ తరహా సేవల్ని 38 దేశాల‍్లో అందిస్తుండగా.. తాజాగా కెనడాతో కుదుర్చుకున్న ఒప్పందంతో ఆ సంఖ్య మొత్తం 39కి చేరింది. 

39 దేశాల్లో పోస్టాఫీస్‌ సేవలు 
జూన్‌ 1, 2023 ముందు వరకు 16 దేశాలకు మాత్రమే దేశీయ పోస్టాఫీసుల నుంచి దేశీయంగా తయారు చేసిన వస్తువల్ని విదేశాలకు పంపుకునే వెసలు బాటు ఉంది. జూన్‌ 1 తర్వాత ఆ సంఖ్య 38కి చేరింది. భారత్‌ కొత్తగా ఒప్పందం  చేసుకున్న దేశాల జాబితాలో ఫ్రాన్స్‌, బ్రిటన్‌, యూఏఈ, ఈజిప్ట్‌తో పాటు ఇతర దేశాలు ఉన్నాయి. 

ధరలు ఎలా ఉన్నాయి
ఇంటర్‌నేషనల్‌ స్పీడ్‌ పోస్ట్‌, ఇతర మార్కెట్ సంస్థల ఉత్పత్తులతో పోల్చితే ఐటీపీఎస్‌ రేట్లు అందుబాటులో ఉన్నాయని పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు చెబుతున్నారు. మొదటి 50 గ్రాముల పార్శిళ్లపై రూ.400 వసూలు చేస్తుండగా.. అదనంగా ప్రతి 50 గ్రాములకు రూ.35 చొప్పున చెల్లించాలి. ఇలా 2 కేజీల వరకు నామమాత్రంగా సర్వీసులు ఛార్జీలు వసూలు చేస్తుండగా.. ఆపై వస్తువు బరువు, ప్రాంతాన్ని బట్టి రేట్లు మారతాయని పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది.

ఇదీ చదవండి :  పాకిస్తాన్‌లో జాక్‌మా ప్రత్యక్షం.. రహస్య ప్రాంతంలో

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)