Breaking News

రతన్‌టాటాకు మోదీ ఎస్‌ఎంఎస్‌

Published on Fri, 10/11/2024 - 06:32

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో ‘వెల్‌కమ్‌’ అంటూ రతన్‌ టాటాకు పంపించిన ఒక ఎస్‌ఎంఎస్‌.. సామాన్యుల కారు ‘నానో’ ప్లాంట్‌ను పశి్చమబెంగాల్‌లోని సింగూర్‌ నుంచి గుజరాత్‌లోని సనంద్‌కు తరలేలా చేసింది. పశి్చమబెంగాల్‌లోని సింగూర్‌లో టాటా నానో ప్లాంట్‌ కోసం భూసమీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుత సీఎం, నాటి ప్రతిపక్ష నేత మమతా బెనర్జీ రైతులతో కలసి 2006లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అది ఎంతకీ పరిష్కారమయ్యేలా కనిపించకపోవడంతో రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు రతన్‌టాటా ప్రకటించారు.

 ఆ సమయంలో తాను పంపిన ఎస్‌ఎంఎస్‌ ఎలాంటి ఫలితాన్నిచ్చందన్నది నాటి సీఎం మోదీ తర్వాత స్వయంగా ప్రకటించారు. ‘‘తాము పశి్చమబెంగాల్‌ను వీడుతున్నట్టు కోల్‌కతాలో రతన్‌టాటా మీడియా సమావేశంలో ప్రకటిస్తున్న వేళ, ‘వెల్‌కమ్‌’ అంటూ నేను ఒక చిన్న ఎస్‌ఎంఎస్‌ పంపాను. రూపాయి ఖర్చుతో పంపించిన ఎస్‌ఎంఎస్‌ ఏమి చేయగలదో మీరు ఇప్పుడు చూస్తున్నారు’’అంటూ గుజరాత్‌లోని సనంద్‌లో రూ.2,000 కోట్లతో టాటా ఏర్పాటు చేసిన నానో ప్లాంట్‌ను 2010లో ప్రారంభిస్తున్న వేళ నాటి సీఎం మోదీ ప్రకటించారు. దేశ పారిశ్రామిక చరిత్రలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)