Breaking News

అమెరికా నుంచి ఐఫోన్‌ తెప్పించుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోండి..

Published on Wed, 09/27/2023 - 21:27

అమెరికా నుంచి యాపిల్‌ (Apple) ఐఫోన్‌ 15 ప్రో (iPhone 15 Pro) మోడల్‌ తెప్పించుకుంటున్నారా? భారత్‌లో కంటే ధర తక్కువన్న కారణంతో అక్కడ ఉంటున్న బంధువులు, స్నేహితుల ద్వారా ఈ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే మీరు గమనించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది.

ఐఫోన్ 15 మోడల్‌లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు సహా భారత్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. దేశంలోని ఆఫ్‌లైన్ యాపిల్‌ స్టోర్‌లు, ఆన్‌లైన్ ఛానెల్‌లలో కస్టమర్లు వీటిని కొనుగోలు చేస్తున్నారు. కాగా ఐఫోన్ 15 ప్రో ధర భారత్‌లో రూ. 1,34,900 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర అయితే రూ. 1,59,900 ఉంది.

(iPhone 15: షాకింగ్‌.. బ్రేకింగ్‌! ఇదేం ఐఫోన్‌ భయ్యా.. వైరల్‌ వీడియో)

అదే సమయంలో ఐఫోన్‌ ప్రో మోడల్స్‌ను దిగుమతి చేసుకునే గ్రే మార్కెట్ ప్రాక్టీస్ కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది. విదేశాల్లోని తమ స్నేహితులు, కుటుంబ సభ్యుల ద్వారా భారతీయ కస్టమర్లు అక్కడ ఐఫోన్లు కొనుగోలు చేస్తున్నారు. యూఎస్, యూఏఈ  వంటి దేశాలలో ఐఫోన్ ప్రో మోడల్స్ తక్కువ ధరకు లభిస్తుండటమే దీనికి కారణం.

అమెరికా ఐఫోన్లతో ఇదే సమస్య
అయితే విదేశాల్లో లభించే ఐఫోన్‌లలో ఉండే సమస్యల గురించి చాలా మందికి తెలియదు. వీటిలో ముఖ్యమైనది ఫిజికల్ సిమ్ స్లాట్ లేకపోవడం. ప్రధానంగా యూఎస్ నుంచి కొనుగోలు చేసే ఐఫోన్ 15 ప్రో లేదా ఐఫోన్ 15లలో ఈ-సిమ్‌ మాత్రమే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే యాపిల్ ఆ దేశంలో ఫిజికల్ స్లాట్‌లతో కూడిన ఫోన్‌లను విక్రయించడం ఆపేసింది. 

కాబట్టి ఫిజికల్ సిమ్ స్లాట్ కావాలంటే  యూఎస్ వేరియంట్‌ను కొనుగోలు చేయకపోవడం మంచిది. ఇక యూరప్, యూఏఈ వంటి ఇతర దేశాల్లో లభించే ఫోన్లకు సింగిల్‌ సిమ్‌ స్లాట్‌లు ఉంటాయి.

ఫిజికల్ డ్యూయల్ సిమ్ స్లాట్లు కావాలంటే..
హాంకాంగ్‌లో లభించే ఐఫోన్‌లు ఫిజికల్ డ్యూయల్ సిమ్ స్లాట్‌లతో వస్తాయి. ఏకకాలంలో రెండు సిమ్ కార్డ్‌లను వీటిలో ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్‌ భారత్‌లో విక్రయిస్తున్న ఐఫోన్‌ 15 ప్రో వేరియంట్‌లో కూడా లేదు. ఇందులో ఒక ఫిజికల్ సిమ్‌, ఒక ఈ-సిమ్‌ ఆప్షన్‌ మాత్రమే ఉంటుంది.

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)