Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..
Breaking News
Petrol, Diesel Prices: మళ్లీ పెరిగిన ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే!
Published on Thu, 05/27/2021 - 08:58
Petrol, Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. గురువారం పెట్రోల్ ధరపై 25 పైసలు, డీజిల్‌పై 32 పైసల పెరుగుదల నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.100కు చేరువలో ఉంది. అక్కడ లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.99.94, డీజిల్ ధర లీటరుకు 91.87 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.93.68, డీజిల్ ధర 84.61కు పెరిగింది. మే 4 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఇది పద్నాలుగోసారి.
► హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.97.52, డీజిల్ రూ.92.39
► చెన్నైలో పెట్రోల్ రేటు 95.28, డీజిల్ ధర లీటరుకు రూ.89.39
► కోల్‌కతాలో ధరలు పెట్రోల్ ధర 93.72 కాగా లీటర్ డీజిల్ రేటు రూ.87.46
చదవండి: అమెజాన్ చేతికి ఎంజీఎం
Tags : 1