Breaking News

మీ స్మార్ట్‌వాచ్‌.. బీమా ప్రీమియం​ డిసైడ్‌ చేస్తుందా?

Published on Wed, 12/24/2025 - 18:27

ఉదయాన్నే లేచి పార్కులో వాకింగ్ చేస్తున్నారా? ఆఫీసులో లిఫ్ట్‌కు బదులు మెట్లు ఎక్కుతున్నారా? రాత్రికి సమయానికి నిద్రపోతున్నారా? అయితే, ఇవన్నీ కేవలం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మీ జేబును కూడా కాపాడబోతున్నాయి! ఇప్పటివరకు మీ వయసును బట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం నిర్ణయించే బీమా కంపెనీలు ఇకపై మీరు ఎలా జీవిస్తున్నారు(Lifestyle) అనే అంశాన్ని బట్టి రేట్లను ఫిక్స్ చేయనున్నాయి.

ఒకప్పుడు బీమా అంటే కేవలం పాలసీ పత్రాలు, క్లెయిమ్‌లకే పరిమితం. కానీ ఇప్పుడు ‘పే-హౌ-యు-లివ్’(Pay-How-You-Live) విధానంతో అడుగులు వేస్తోంది. కస్టమర్ల జీవనశైలి, ఆరోగ్య అలవాట్లు, రోజువారీ డేటా ఆధారంగా ప్రీమియంలను నిర్ణయించేదే ఈ విధానం. మీ స్మార్ట్ వాచ్ ఇచ్చే డేటా ఆధారంగా మీరు ఆరోగ్యంగా ఉంటే మీ బీమా ప్రీమియం తగ్గుతుంది. అంటే మీ ఆరోగ్యం ఇప్పుడు మీ ఆర్థిక ప్రణాళికలో ఒక భాగం కాబోతోంది. 2025లో ఐఆర్‌డీఏఐ తెచ్చిన సంస్కరణలతో ఈ డైనమిక్ ఇన్సూరెన్స్ మోడల్ ఇప్పుడు సామాన్యులకు మరింత చేరువకానుంది.

‘పే హౌ యు లివ్’ అంటే..

సాధారణంగా బీమా పాలసీలు వయసు, జెండర్‌ వంటి ప్రాథమిక అంశాల ఆధారంగా ధరలను నిర్ణయిస్తాయి. కానీ, ‘పే-హౌ-యు-లివ్’ నమూనాలో రియల్ టైమ్ వెల్‌నెస్‌ డేటా కీలకం అవుతుంది. స్మార్ట్ వాచ్‌లు, ఫిట్‌నెస్ యాప్‌ల ద్వారా సేకరించిన సమాచారం (ఉదాహరణకు రోజువారీ నడక, నిద్ర సమయం, వ్యాయామం) ఆధారంగా అల్గారిథమ్‌లు బీమా ప్రీమియంలను సర్దుబాటు చేస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునే ఆరోగ్యవంతులకు ప్రీమియం తగ్గుతుంది. మీ జీవనశైలి మెరుగుపడితే మీ ఇన్సూరెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది.

2025లో వచ్చిన మార్పులు

  • ఈ విధానం వేగవంతం కావడానికి ఐఆర్‌డీఏఐ (బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ) 2025లో ప్రవేశపెట్టిన నూతన మార్గదర్శకాలు ఈ మార్పులకు ప్రధాన కారణం.

  • ఆరోగ్య బీమా తీసుకోవడానికి ఉన్న గరిష్ట వయసు పరిమితులను తొలగించడం వల్ల వృద్ధులకు కూడా ఈ వెల్‌నెస్‌ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి.

  • గతంలో 8 ఏళ్లుగా ఉన్న మోరటోరియం కాలాన్ని(పాలసీదారుడు తన పాలసీని నిర్దిష్ట కాలం పాటు కొనసాగించిన తర్వాత బీమా సంస్థ తన క్లెయిమ్‌ను తిరస్కరించడానికి వీలులేని కాలం) 5 ఏళ్లకు తగ్గించడం ద్వారా వినియోగదారులకు భరోసా పెరిగింది.

  • వృద్ధులపై ప్రీమియం భారం పడకుండా, పెంపును 10% కి పరిమితం చేయడం వంటి చర్యలు ఈ మోడల్‌ను మరింత న్యాయబద్ధంగా మార్చాయి.

  • స్మార్ట్ పరికరాల వాడకం పెరగడం వల్ల డేటా సేకరణ సులభమైంది.

ప్రస్తుత మార్కెట్ స్థితిగతులు

  • భారతదేశంలో ఈ ధోరణి ఇప్పటికే మోటార్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రారంభమైంది. ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి సంస్థలు ‘పే హౌ యు డ్రైవ్’ ద్వారా సురక్షితంగా వాహనం నడిపేవారికి రాయితీలు ఇస్తున్నాయి.

  • ఆరోగ్య బీమా.. ప్రస్తుతం జిమ్ మెంబర్‌షిప్‌లు లేదా స్టెప్ కౌంట్ ఆధారంగా రివార్డ్ పాయింట్లు ఇచ్చే పైలట్ ప్రాజెక్టులు నడుస్తున్నాయి.

  • జీవిత బీమా.. 2025 నాటికి టాప్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు వెల్‌నెస్‌ రైడర్లను జోడిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నవారికి పేఅవుట్లను పెంచేలా మార్పులు జరుగుతున్నాయి.

సవాళ్లు

ఈ విధానం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయి. వ్యక్తిగత ఆరోగ్య సమాచారాన్ని నిరంతరం పర్యవేక్షించడం వల్ల డేటా భద్రతపై ఆందోళనలు ఉన్నాయి. జన్యుపరమైన లేదా అనివార్యమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ మోడల్ వల్ల ప్రీమియం భారం పెరిగే ప్రమాదం ఉంది. దీన్ని నివారించడానికి ఐఆర్‌డీఏఐ పారదర్శకత, సమ్మిళిత నిబంధనలను కఠినతరం చేస్తోంది.

పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాబోయే ఐదేళ్లలో ఈ మోడల్‌కు మరింత ఆదరణ పెరుగుతోంది. దేశంలోని యువత సాంకేతికతను ఇష్టపడటం ఈ మార్పుకు కలిసివచ్చే అంశం. బీమా అనేది కేవలం ఆపదలో ఆదుకునే ఆర్థిక ఉత్పత్తిగానే కాకుండా, కస్టమర్లను ఆరోగ్యంగా ఉంచే ఒక వెల్‌నెస్‌ పార్టనర్‌గా రూపాంతరం చెందుతోంది.

ఇదీ చదవండి: ‘యూనివర్సల్ స్టూడియోస్’ మెగా థీమ్‌ ప్రాజెక్ట్.. ఎక్కడంటే..

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)