ప్రపంచ కుబేరురాలు పార్క్‌బామ్‌?

Published on Fri, 10/24/2025 - 09:15

దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ పాప్ గాయని పార్క్‌బామ్‌ (Park Bom) ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా మారే అవకాశం ఉందంటూ ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. పార్క్‌బామ్‌ గతంలో చేసిన పోస్ట్‌ను కోట్‌ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు వైరల్‌ అవుతున్నాయి.

పార్క్‌బామ్‌ గతంలో పని చేసిన ఏజెన్సీ వైజీ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థాపకుడు యాంగ్ హ్యున్ సుక్ (Yang Hyun Suk) తనను భారీ మొత్తంలో మోసం చేశారని ఆరోపిస్తూ ఇటీవల తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌లో ఆమె దాదాపు 4.5 క్వాడ్రిలియన్ డాలర్లు (రూ.4,500 లక్షల కోట్లు-Quadrillion - ఒకటి తర్వాత 15 సున్నాలు) చెల్లించాలని డిమాండ్ చేసినట్లు ఒక లీగల్ డాక్యుమెంట్ స్క్రీన్‌షాట్‌ను పోస్ట్‌ చేశారు. ఈ మొత్తం దాదాపు ప్రపంచ జీడీపీకి 41 రెట్లతో సమానం. దాంతో అందులో తెలిపిన మొత్తం చాలా అసాధారణంగా ఉండడంతో ఈమేరకు పోస్ట్‌లు చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వివాదంలో పార్క్‌బామ్‌ ఈ భారీ మొత్తాన్ని నిజంగా గెలిస్తే ఆమె ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలిగా, తొలి ట్రిలియనీర్‌గా, ప్రపంచ కుబేరుడిగా ఉన్న ఎలాన్ మస్క్‌ను అధిగమించిన తొలి మహిళగా మారుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇదీ చదవండి: ర్యాంక్‌ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)