Breaking News

ఐఎంఎఫ్‌ తీవ్ర అభ్యంతరం.. పాక్‌ బడ్జెట్‌పై గందరగోళం!

Published on Tue, 06/03/2025 - 17:34

రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టే బడ్జెట్‌లో పాకిస్థాన్‌ రక్షణ వ్యయానికి చేసే కేటాయింపులపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి ఆందోళనలు రేకెత్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం కంటే సైనిక చర్యలకు నిధులు కేటాయించడంపై ఐఎంఎఫ్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అభ్యంతరాలు తీవ్రం అవుతున్న నేపథ్యంలో జూన్‌ 2న విడుదల చేయనున్న పాకిస్థాన్‌ బడ్జెట్‌ను జూన్‌ 10కి వాయిదా వేశారు.

పాక్‌ ప్రతిపాదిత బడ్జెట్‌లో రక్షణ వ్యయాన్ని 18% పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీన్ని దేశ ఆర్థిక రికవరీని పర్యవేక్షిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అధిక ద్రవ్యోల్బణం (38% కంటే ఎక్కువ), పెరుగుతున్న రుణ భారం, 25 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుతో పాక్‌ పోరాడుతున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాల కంటే సైనిక నిధులకు ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని ఐఎంఎఫ్‌ అభిప్రాయపడుతోంది. ఇటీవల ఒక బిలియన్‌ డాలర్ల అప్పును ఐఎంఎఫ్‌ పాకిస్థాన్‌కు ఆమోదించిన విషయం తెలిసిందే.

బడ్జెట్ వాయిదా

రక్షణ కేటాయింపులు, పన్ను కోతలకు సంబంధించి ఐఎంఎఫ్‌తో విభేదాలు తలెత్తడంతో జూన్‌ 2న విడుదల కావాల్సిన బడ్జెట్‌ను పాకిస్థాన్‌ జూన్ 10కి వాయిదా వేసింది. ఇప్పటికే బలహీనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడిని నివారించేలా చర్యలు తీసుకోవాలని ఐఎంఎఫ్‌ సూచించింది. సైనిక వ్యయాన్ని భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను గుర్తించాలని ఐఎంఎఫ్ పాకిస్థాన్‌కు తెలిపింది.

అభివృద్ధి కార్యక్రమాలకు కోతలు

పాకిస్థాన్‌ ప్రతిపాదిత బడ్జెట్ సవరణలో అభివృద్ధికి అత్యంత కీలకంగా ఉన్న పబ్లిక్ సెక్టార్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్ (పీఎస్‌డీపీ)కి కేటాయింపులను గతంలో కంటే 20% తగ్గించారు. ఈ తగ్గింపు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వానికి దోహదపడే రంగాల్లో వృద్ధి అవకాశాలను పరిమితం చేస్తుంది.

పెరుగుతున్న రుణ, ఆర్థిక సవాళ్లు

పాకిస్థాన్‌ రుణ-జీడీపీ నిష్పత్తి(డెట్‌ టు జీడీపీ రేషియో) 70%గా ఉంది. ఇది దేశం ఆర్థిక సౌలభ్యం, అత్యవసర సేవలకు నిధులు సమకూర్చే వెసులుబాటును పరిమితం చేస్తుంది. పెరుగుతున్న వాణిజ్య లోటు నిర్వహణను మరింత క్లిష్టతరం చేస్తుంది. ఆర్థిక పునరుద్ధరణకు తక్కువ మార్గాలను చూపుతుంది.

ఇదీ చదవండి: రిజిస్ట్రేషన్‌ బిల్లు-2025 ముసాయిదా విడుదల

గతంలో కంటే బడ్జెట్‌లో భారీగా కోతలు ఎదుర్కొంటున్న ఇతర రంగాలు..

  • మౌలిక సదుపాయాలు: రూ.644 బిలియన్లు (రూ.661 బిలియన్ల నుంచి తగ్గుదల)

  • ఎనర్జీ: రూ.144 బిలియన్లు (రూ.169 బిలియన్ల నుంచి తగ్గుదల)

  • నీటి నిర్వహణ: రూ.109 బిలియన్లు (రూ .135 బిలియన్ల నుండి తగ్గింది)

  • హౌసింగ్ అండ్ ఫిజికల్ ప్లానింగ్: రూ.59 బిలియన్లు (రూ.89 బిలియన్ల నుంచి 34 శాతం క్షీణత)

  • సోషల్ సెక్టార్లు: రూ.150 బిలియన్లు (రూ.200 బిలియన్ల నుంచి 25% తగ్గుదల)

  • సైన్స్ అండ్ టెక్నాలజీ: రూ.53 బిలియన్లు (రూ.62 బిలియన్ల నుంచి తగ్గుదల)

  • గవర్నెన్స్ ప్రాజెక్టులు: రూ.9 బిలియన్లు (రూ.17 బిలియన్ల నుంచి తగ్గుదల)

  • ఉత్పత్తి రంగాలు: రూ .11 బిలియన్లు (రూ .15 బిలియన్ల నుండి తగ్గాయి).
     

Videos

నా చావుకు కారణం ఆ ముగ్గురే.! మాధురి రాథోడ్ లేఖ వైరల్..

కుప్పకూలిన భారీ భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?

ఎవడికీ భయపడాల్సిన పని లేదు... చంద్రబాబుకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

హే మిస్టర్.. దమ్ముంటే CBI ఎంక్వైరీ వేయ్..

ఒక్కడే ఒక సైన్యంలా.. కలుషిత నదికి ప్రాణం పోస్తున్న యువకుడు..!

నేను జగన్ చెంచాను అయితే.. నువ్వు చంద్రబాబు కు చెంచావా..?

హెరిటేజ్ లో పాలు అమ్మినట్టు.. టీచర్ పోస్టులను అమ్మేశారు

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Photos

+5

తెలగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)

+5

నిర్మాతల మండలి ఎన్నికలు..ఓటేసిన టాలీవుడ్‌ సెలెబ్రెటీలు (ఫోటోలు)

+5

ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 06 -సెప్టెంబర్ 12)

+5

'అంతా రాములోరు చూసుకుంటారు' మూవీ టైటిల్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)