Breaking News

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఇక సర్దుకోవాల్సిందే..!

Published on Sat, 03/01/2025 - 16:22

ఆటోమేషన్‌... ఈ పదం జాబ్‌ మార్కెట్‌ను వణికిస్తోంది. ముఖ్యంగా టెక్‌ పరిశ్రమలో ఉద్యోగులకు గుబులు పుట్టిస్తోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ విస్తరణతో చాలా కంపెనీలు ఆటోమేషన్‌ (automation) బాట పట్టాయి. దీంతో ఉద్యోగుల మనుగడకు ముప్పు ఏర్పడింది. తాజాగా ఇన్‌మోబి (InMobi) సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ తివారీ పిడుగులాంటి వార్త చెప్పారు.

వారికి ఉద్యోగాలు ఉండవు
ఈ ఏడాది చివరి నాటికి సాఫ్ట్ వేర్ కోడింగ్ లో తమ సంస్థ 80 శాతం ఆటోమేషన్ ను సాధిస్తుందని, ఫలితంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు (software engineers) ఉద్యోగాలు పోతాయని నవీన్ తివారీ వెల్లడించారు. 'మా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వెళ్లిపోతారని అనుకుంటున్నాను. రెండేళ్లలో వారికి ఉద్యోగాలు ఉండవు' అని ప్రారంభ దశ ఇన్వెస్ట్ మెంట్ ప్లాట్ ఫామ్ లెట్స్ వెంచర్ నిర్వహించిన కార్యక్రమంలో తివారీ అన్నారు. ‘ఈ ఏడాది చివరి నాటికి సాఫ్ట్ వేర్ కోడింగ్ లో 80 శాతం ఆటోమేషన్ ను నా సీటీవో (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ) అందిస్తారు. ఇప్పటికే 50 శాతం సాధించాం. యంత్రం సృష్టించిన కోడ్లు వేగంగా, మెరుగ్గా ఉంటాయి. అలాగే అవి తమను తాము సరిచేసుకోగలవు" అని ఆయన లెట్స్ వెంచర్ సీఈవో శాంతి మోహన్‌తో అన్నారు.

ఇన్‌మోబి సీఈవో నవీన్ తివారీ

మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి..
అత్యంత ప్రత్యేకమైన ఉద్యోగాలకు మొదట కృత్రిమ మేధ (ఏఐ) వస్తుందని, ఉద్యోగులు తమను తాము అప్ గ్రేడ్ చేసుకోవాలని తివారీ పిలుపునిచ్చారు. "మిమ్మల్ని మీరు అప్ గ్రేడ్ చేసుకోండి, మిమ్మల్ని అప్ గ్రేడ్ చేయమని నన్ను అడగకండి. ఎందుకంటే ఇది మనుగడ. మీ కింద ప్రపంచం మారుతోంది' అని ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇది చదివారా? ఐటీ కంపెనీ కొత్త రూల్‌.. పరీక్ష పాసైతేనే జీతం పెంపు

ఇన్‌మోబిలో రెండు కంపెనీలు ఉన్నాయి. ఒకటి ఇన్‌మోబి యాడ్స్. ఇది అడ్వర్‌టైజింగ్ టెక్నాలజీపై పనిచేసే బిజినెస్-టు-బిజినెస్ కంపెనీ. మరొకటి గ్లాన్స్. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ల కోసం రూపొందించిన స్మార్ట్ లాక్ స్క్రీన్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్ ను అందించే కన్స్యూమర్ టెక్నాలజీ బిజినెస్-టు-కన్స్యూమర్ కంపెనీ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గ్లాన్స్ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్ల కోసం జెన్ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి గూగుల్ క్లౌడ్‌తో తాజాగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)