Breaking News

ఒక్కరోజు 40 శాతంపైగా పెరిగిన స్టాక్‌.. కారణం..

Published on Thu, 09/11/2025 - 14:07

ఒరాకిల్ స్టాక్ గతంలో ఎప్పుడూ లేనంతగా ఒక్కరోజులో ఏకంగా 40 శాతంపైగా పెరిగి రికార్డు నెలకొల్పింది. సెప్టెంబర్‌ 10న మార్కెట్‌ ప్రారంభమైనప్పటి నుంచి స్టాక్‌ క్రమంగా పెరుగుతూ 345.38 డాలర్లు(మునుపటి సెషన్‌తో పోలిస్తే 40 శాతంపైగా) పెరిగి ముగింపు సమయానికి 328.33(35.95 శాతం) డాలర్ల వద్ద స్థిరపడింది. ఒరాకిల్‌ ఇటీవల విడుదల చేసిన త్రైమాసిక ఫలితాలకు తోడు ఇతర కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు, సంస్థ అనుసరిస్తున్న విధానాలు పెట్టుబడిదారులను ఆకర్షించాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

స్టాక్ పెరుగుదల ప్రధాన కారణాలు

  • క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఒరాకిల్‌ ఏఐ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కీలకంగా మారుతోంది. కంపెనీ ఓపెన్‌ఏఐ, మెటా, ఎన్విడియా, బైట్‌డ్యాన్స్‌.. వంటి ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దాంతో ఒరాకిల్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆదాయం 2026 ఆర్థిక సంవత్సరంలో 77% పెరిగి 18 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని కంపెనీ తెలిపింది. ఇది 2030 నాటికి 144 బిలియన్‌ డాలర్ల మార్కునుతాకే అవకాశం ఉందని అంచనా.

  • ఒరాకిల్ క్లౌడ్ సేవలకు డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. ఈ విభాగంలో ఆదాయం 455 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీ ఏఐ, ఎంటర్‌ప్రైజ్‌ పరిష్కారాలతో ముడిపడి ఉన్న భవిష్యత్తు వ్యాపారాన్ని ఇది హైలైట్‌ చేస్తుంది.

  • ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో స్ట్రాటజిక్ పొజిషనింగ్‌లో ఒరాకిల్ సొంత సర్వీసులు వాడుతోంది. దాని డేటా సెంటర్లను వేగంగా అభివృద్ధి చేస్తోంది. కృత్రిమ మేధ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేక్రమంలో ఎన్విడియా జీపీయూలకు భద్రతను అందిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్..వంటి క్లౌడ్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న కంపెనీల సరసన ఒరాకిల్ ప్రత్యర్థిగా ఎదుగుతోంది.

ఇదీ చదవండి: 22 వరకూ ఆగుదాం!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)