Breaking News

ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు.. జీఎస్టీ తగ్గించాలని లేఖ

Published on Wed, 08/02/2023 - 07:45

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ తమపై ఇటీవల విధించిన 28 శాతం జీఎస్‌టీని తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. అధిక పన్ను భారం చట్టవిరుద్ధమైన గేమింగ్‌ సంస్థలను పరోక్షంగా ప్రోత్సహించినట్టు అవుతుందని పేర్కొంది. చట్టవిరుద్ధమైన, ఆఫ్‌షోర్‌ గేమింగ్‌ సంస్థలకు ఎలాంటి పన్ను భారం ఉండదని, ప్రభుత్వ నిర్ణయం చట్ట పరిధిలో పనిచేసే ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థలను రిస్క్‌లోకి నెడుతుందని ఇండియన్‌ గేమర్స్‌ యునైటెడ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

టైర్‌–2, 3 పట్టణాల్లోని ఆన్‌లైన్‌ గేమర్స్‌తో కూడిన ఈ అసోసియేషన్‌ ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఓ లేఖ రాసింది. గ్యాంబ్లింగ్‌కు, స్కిల్‌ గేమింగ్‌కు స్పష్టమైన వ్యత్యాసం చూపించాలని సూచించింది. అన్ని రకాల గేమింగ్‌ సంస్థలను 28 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తూ ఈ నెల మొదట్లో జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

గుర్రపు పందేలు, జూదం వంటి అదృష్టాన్ని పరీక్షించుకునే గేమ్‌లు, నైపుణ్యాలతో కూడిన గేమ్‌లను ఒకే గాటన కట్టొద్దంటూ, ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని తిరిగి సమీక్షించాలని అసోసియేషన్‌ కోరింది. పన్ను పరంగా అనుకూలంగా ఉండేలా పరిశ్రమ పట్ల వ్యవహరించాలని సూచించింది. ఆన్‌లైన్‌ స్కిల్‌ గేమింగ్‌లను యువత తమ గేమింగ్‌ నైపుణ్యాలతో ఆడుతూ, కొంత ఆదాయాన్ని ఆర్జిస్తోందని వివరిస్తూ.. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నట్టు తెలిపింది.

28 శాతం జీఎస్‌టీ అనేది ఎదుగుతున్న ఆన్‌లైన్‌ స్కిల్‌ గేమింగ్‌ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. మరోవైపు బుధవారం సమావేశమయ్యే జీఎస్‌టీ కౌన్సిల్‌.. గేమింగ్‌ పరిశ్రమకు సంబంధించి 28 శాతం జీఎస్‌టీ అమలు విధి విధానాలను ఖరారు చేయనుంది.

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు