Breaking News

ఉద్యోగులకు అలర్ట్.. శ్రీధర్ వెంబు సంచలన వ్యాఖ్యలు!

Published on Thu, 10/29/2026 - 13:04

టెక్నాలజీ రోజురోజుకీ వేంగంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల పని విధానంలోనూ కూడా చాలా మార్పులు వచ్చాయి. గతంలో ఒక పని పూర్తి చేయడానికి ఎక్కువ మంది అవసరమయ్యేవారు. కానీ.. ఇప్పుడు ఏఐ సాయంతో అదే పనిని తక్కువ సమయంలో.. తక్కువ మంది సాయంతో పూర్తి చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జోహో సహ వ్యవస్థాపకుడు.. చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఒక్కరితో 10 మంది పని!
కంప్యూటర్‌పై చేసే పనుల్లో.. ఏఐ ప్రభావం మరింత పెరుగుతోందని శ్రీధర్ వెంబు పేర్కొన్నారు. ఏఐని తెలివిగా ఉపయోగించుకునే ఒక్క వ్యక్తి.. పది మంది చేసే పనిని చేయగలడని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇప్పటికే సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, డేటా విశ్లేషణ వంటి రంగాల్లో ఏఐ వినియోగం భారీగా పెరుగుతోంది. గతంలో గంటల సమయం పట్టే కొన్ని పనులను ఇప్పుడు ఏఐ సాయంతో తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నారు. దీంతో కంపెనీలకు సమయం, ఖర్చు ఆదా అవుతోంది.

ఏఐ సాయంతో పని ఎక్కువగా జరుగుతుంది అంటే.. దీనర్థం ఎక్కువమంది ఉద్యోగాలను కోల్పోవలసి వస్తుందని కాదు. ఉద్యోగాల స్వరూపం మారుతుందని శ్రీధర్ వెంబు స్పష్టం చేసారు. అయితే ఏఐ వల్ల కొన్ని పనులకు మనుషుల అవసరం తగ్గవచ్చు. అదే సమయంలో, కొత్త అవకాశాలు కూడా ఏర్పడవచ్చు.

ఏఐపై భారీ పెట్టుబడులు
ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, ఒరాకిల్ వంటి సంస్థలు తమ ఉద్యోగుల సంఖ్య, ఖర్చులు, పని విధానాల్లో మార్పులు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారు.

ఏఐ సాయంతో తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పని చేయగలిగే అవకాశం ఉండటంతో కంపెనీలు తమ వ్యాపార వ్యూహాలను మార్చుకుంటున్నాయి. అయితే.. ఉద్యోగుల కోతలకు ఏఐ ఒక్కటే కారణం కాదు. ఖర్చులు తగ్గించడం, వ్యాపార పరిస్థితులు, సంస్థల పునర్వ్యవస్థీకరణ వంటి ఇతర అంశాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయి.

నిపుణుల సూచనలు
ఏఐ వస్తోందని భయపడటం కంటే, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంచుకోవడంతో పాటు, ఏఐ సాధనాలపై అవగాహన పెంచుకోవాలి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో కొత్త విషయాలను నేర్చుకోవడం ఉపయోగపడుతుంది.

ఏఐ ఇచ్చే సమాచారాన్ని పరిశీలించడం, తప్పులను గుర్తించడం, సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం వంటి నైపుణ్యాలు కూడా కీలకంగా మారనున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమను తాము అప్‌డేట్ చేసుకునే ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: అంతరిక్షంలో అమెరికా జోరు.. రష్యా కొత్త వ్యూహం ఇదే!

Videos

నా పెళ్లి గురించి మీకెందుకు? KTR పై బల్మూరి వెంకట్ భార్య ఫైర్

కాస్కోండి ఒక్కొక్కడికి ప్యాంట్ తడిచిపోకపోతే.. రోజా నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

భాగ్యలక్ష్మి పై ట్రోల్స్ చేయడం కాదు.. దమ్ముంటే..!

హీరోగా వంగా ఇక స్క్రీన్ పై అరాచకమే

పబ్లిసిటీ ఆపి.. రైతులను ఆదుకో చంద్రబాబుకు కన్నబాబు డిమాండ్స్

దొంగ సంతకాలతో విత్ డ్రా చేశారు... మంత్రి ఆనంపై సంచలన వ్యాఖ్యలు

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)