Breaking News

ఓలా కృత్రిమ్‌లో రెండో విడత లేఆఫ్స్‌

Published on Mon, 07/28/2025 - 10:47

ఓలాకు చెందిన భవీష్ అగర్వాల్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘కృతిమ్’ రెండో విడత ఉద్యోగాలను తొలగించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ విడతలో 100 మందికి పైగా సిబ్బందిని ఇంటికి పంపినట్లు తెలుస్తుంది. ఈ లేఆఫ్స్‌లో ప్రధానంగా ఇటీవలే కంపెనీలో చేరిన లింగ్విస్టిక్స్‌ బృందంలో పని చేస్తున్న వారిని అధికంగా తొలగించినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి.

జూన్‌లో కృతిమ్ మొదటి రౌండ్ ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. అందులో భాగంగా డజనుకుపైగా సిబ్బందికి లేఆఫ్స్‌ ప్రకటించింది. తాజాగా 100కుపైగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తుంది. ఈ తొలగింపులు కంపెనీ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో భాగమని, ఉన్న వనరులను మెరుగ్గా నిర్వహించడానికి ఇది ఎంతో తోడ్పడుతుందని ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు.

ఇదీ చదవండి: బంగారు బాతులను చంపేస్తున్నారు.. దేశానికి సిగ్గుచేటు

జూన్‌లో కంపెనీ కృత్రిమ్‌లో ఏఐ అసిస్టెంట్ ‘కృతి’ని ప్రారంభించింది. దీనికి దాదాపు 80 శాతం శిక్షణ ఇచ్చామని, గతంలో మాదిరిగా తమకు ఎక్కువ మంది సిబ్బంది అవసరం లేదని ఒక అదికారి తెలిపారు. కృత్రిమ్‌ గతంలో కృత్రిమ మేధ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో భారీ పెట్టుబడులను ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో భవీష్ అగర్వాల్ కృత్రిమ్‌ ఏఐ ల్యాబ్స్‌ను ఆవిష్కరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి రూ.2,000 కోట్లు కేటాయించారు. వచ్చే ఏడాది ఈ సంఖ్యను రూ.10,000 కోట్లకు పెంచే ప్రణాళికలున్నట్లు తెలిపారు.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)