Breaking News

సీఈఓ కనుసన్నల్లోనే వేతన పెంపు

Published on Mon, 08/11/2025 - 11:59

కార్పొరేట్ నిర్ణయాలు తీసుకునేందుకు చాలా సంస్థలు అల్గారిథమ్స్, సంబంధిత విభాగాలను వాడుకుంటాయి. అందుకు భిన్నంగా ప్రపంచ టాప్‌ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ వైఖరి వేరుగా ఉంది. అతను ఎన్విడియాలోని దాదాపు 42,000 మంది ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరి వేతనాలను వ్యక్తిగతంగా సమీక్షిస్తారు. ‘మీ సిబ్బందిని జాగ్రత్తగా చూసుకుంటే.. మిగిలినవన్నీ వాటంతటవే వస్తాయి’ అనే ఫిలాసఫీని నమ్ముతానని హువాంగ్‌ తెలిపారు.

వేతన పెంపు నిర్ణయంలో వ్యక్తిగత ప్రమేయం వ్యూహాత్మకమైనదని హువాంగ్‌ నమ్ముతున్నారు. ఉద్యోగులకు ఇచ్చే పరిహారాన్ని కేవలం హెచ్‌ఆర్‌కు వదిలేయడం సరికాదని, ప్రతి నెలా తానూ వేతన డేటాను సమీక్షిస్తానని చెప్పారు. అయితే మొత్తం సమాచారాన్ని క్రమబద్ధీకరించడానికి,  దాన్ని విశ్లేషించడానికి సహాయపడే మెషిన్ లెర్నింగ్ టూల్స్‌ను వాడుతానని తెలిపారు. కానీ తుది నిర్ణయం మాత్రం తనదేనని స్పష్టం చేశారు.

ఎన్విడియా టాప్ టాలెంట్‌ను నిలుపుకోవడమే కాకుండా, నాయకత్వ బృందాన్ని విజయవంతంగా అభివృద్ధి చేస్తోందన్నారు. కంపెనీ తన సిబ్బందినిసైతం బిలియనీర్లుగా తీర్చిదిద్దిందని తెలిపారు. వేతన నిర్ణయాల్లో వ్యక్తిగత ప్రమేయం పారదర్శకత, కంపెనీ విధేయతతో కూడిన సంస్కృతిని పెంపొందిస్తోందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కోడింగ్‌ ఉద్యోగాల కథ కంచికేనా?

ఎన్విడియా నిర్వహణ ఖర్చులు రెట్టింపు అయినప్పటికీ హువాంగ్ దీన్ని అవసరమైన పెట్టుబడిగానే భావిస్తున్నారు. దీని ఫలితంగానే కంపెనీ విలువ 2023లో 1 ట్రిలియన్ డాలర్ల నుంచి 2025 నాటికి 4 ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని గుర్తు చేశారు. ఇది ఎన్విడియాను ప్రపంచంలోనే అత్యంత విలువైన టెక్ సంస్థగా మార్చిందని చెప్పారు. ఎన్విడియా ఉద్యోగుల్లో 76% మంది మిలియనీర్లని గర్వంగా తెలిపారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)