Breaking News

అమెరికాలోనూ నో ట్యాక్స్‌..! ట్రంప్‌ భారీ పన్ను ప్రణాళిక

Published on Fri, 03/14/2025 - 17:55

భారత్‌లో మాదిరిగానే అమెరికాలోనూ ఆదాయపు పన్నుకు సంబంధించి భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది అమెరికన్లకు పన్ను మినహాయింపునిచ్చే భారీ పన్ను ప్రణాళికను అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. సంవత్సరానికి 150,000 డాలర్ల కంటే తక్కువ సంపాదించేవారికి ఫెడరల్ పన్నులను తొలగించే యోచనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారని సీబీఎస్ ఇంటర్వ్యూలో లుట్నిక్ చెప్పారు .

'ట్రంప్ లక్ష్యం ఏమిటో నాకు తెలుసు. సంవత్సరానికి 150,000 డాలర్ల కంటే తక్కువ సంపాదించే ఎవరికైనా పన్ను ఉండకూడదు. అదే ఆయన (ట్రంప్‌) లక్ష్యం. దానికోసమే నేను పనిచేస్తున్నా' అని లుట్నిక్ తెలిపారు. లుట్నిక్ అక్కడితో ఆగలేదు. అమెరికన్ల పన్ను భారాలను మరింత తగ్గించే లక్ష్యంతో విస్తృత ఆలోచనలను తెరపైకి తెచ్చారు. పన్ను సంస్కరణలపై దూకుడు వైఖరి ఉంటుందని ఆయన సంకేతాలిచ్చారు.

ట్రంప్ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఏడాదికి 1,50,000 డాలర్లు అంటే సుమారు రూ.1.3 కోట్లు కంటే తక్కువ సంపాదించే వారికి పన్ను చెల్లించకుండా మినహాయింపు లభిస్తుంది. ఈ లక్ష్యాన్ని నిజం చేయడమే తన ప్రస్తుత లక్ష్యమని లుట్నిక్ స్పష్టం చేశారు. కెనడా, మెక్సికోలతో కొనసాగుతున్న సుంకాల యుద్ధాలతో సహా ట్రంప్ ఆర్థిక వ్యూహాన్ని సమర్థిస్తూ.. విధానాలు మాంద్యాన్ని ప్రేరేపించే ప్రమాదం ఉన్నప్పటికీ అవి అవసరమని లుట్నిక్ పేర్కొన్నారు.

ఇక పన్ను కోతలతో ముడిపడిన పెరుగుతున్న లోటుల గురించి ఆందోళనలపై స్పందిస్తూ ప్రభుత్వ ఖర్చులు అమెరికన్లకు భారం కాకూడదన్నారు లుట్నిక్‌.  విదేశీ సంస్థలు, విదేశీ పన్ను ఎగవేతదారులను ప్రస్తావిస్తూ 'ఇతర వ్యక్తులు' ఈ వ్యయాన్ని భరించాలి. అంతర్జాతీయ పన్ను లొసుగులను సరిదిద్దడం వల్ల దేశీయ పన్ను ఉపశమనం లభిస్తుందని ఆయన వివరించారు. మరోవైపు ట్రంప్ వివాదాస్పద 5 మిలియన్ డాలర్ల అమెరికా వీసా ప్రతిపాదనకు కూడా లుట్నిక్ మద్దతు తెలిపారు. ఇది అదనపు ఆదాయాన్ని సృష్టిస్తుందని పేర్కొన్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)