Breaking News

రానున్నది పూర్తిస్థాయి బడ్జెటేనా? ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్పారు?

Published on Fri, 12/08/2023 - 07:16

న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో సమర్పించే బడ్జెట్‌ .. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ మాత్రమేనని, అందులో ఎటువంటి అద్భుతమైన ప్రకటనలు ఉండబోవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. అలాంటి వాటి కోసం, ఎన్నికలయ్యాక ఏర్పడే కొత్త ప్రభుత్వం జూలైలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే దాకా ఎదురు చూడాల్సిందేనని ఆమె తెలిపారు. సీఐఐ గ్లోబల్‌ ఎకనమిక్‌ పాలసీ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. 

ఎన్నికల ముంగిట్లో ప్రవేశపెట్టే బడ్జెట్‌ .. కొత్త సర్కార్‌ కొలువు తీరే వరకు అయ్యే ప్రభుత్వ వ్యయాలకు ఆమోదం పొందేందుకు ఉద్దేశించి ఉంటుంది. దీన్ని ఓట్‌ ఆన్‌ అకౌంట్‌గా వ్యవహరిస్తారు. సాధారణంగా ఇలాంటి వాటిలో ప్రభుత్వం భారీ ప్రతిపాదనలేమీ చేయదు.  మరోవైపు, అన్ని రంగాల్లో కార్యకలాపాలు పుంజుకోవడంతో రెండో క్వార్టర్‌లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అత్యధికంగా నమోదైనట్లు రాజ్యసభలో చర్చ సందర్భంగా నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా భారత్‌ కొనసాగుతోందని ఆమె చెప్పారు. గత ఎనిమిదేళ్ల వ్యవధిలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎకానమీల జాబితాలో భారత్‌ 10వ స్థానం నుంచి అయిదో స్థానానికి చేరిందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మేకిన్‌ ఇండియా, పీఎల్‌ఐ (ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల స్కీము) వంటి తోడ్పాటు చర్యలతో తయారీ రంగం కూడా ఎకానమీ వృద్ధిలో గణనీయంగా పాలుపంచుకుంటోందని మంత్రి చెప్పారు. నిరుద్యోగిత రేటు 2017–18లో దాదాపు 18 శాతంగా ఉండగా ప్రస్తుతం 10 శాతానికి దిగి వచ్చిందన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)