Breaking News

2019 నుంచి 2025 వరకు: 8 బడ్జెట్లు.. 13 గంటలు!

Published on Fri, 01/30/2026 - 17:44

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. భారతదేశ బడ్జెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. ఆదివారం, ఫిబ్రవరి 1న ఆమె యూనియన్ బడ్జెట్ 2026ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమె వరుసగా ప్రవేశపెడుతున్న 9వ కేంద్ర బడ్జెట్ కావడం విశేషం. ఇప్పటికే ఎనిమిది బడ్జెట్లను విజయవంతంగా ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డు సృష్టించారు. అయితే ప్రారంభం నుంచి ఏ బడ్జెట్ ప్రసంగం ఎంత సమయం?, సుదీర్ఘ ప్రసంగం ఎప్పుడు అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

2019లో కేంద్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే కీలక బడ్జెట్లను నిర్మలా సీతారామన్ అందించారు. కరోనా వంటి అసాధారణ పరిస్థితుల్లో కూడా.. ఆమె ప్రవేశపెట్టిన బడ్జెట్లు చరిత్రలో నిలిచిపోయాయి. ముఖ్యంగా 2020లో ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగం సుమారు 2 గంటలు 42 నిమిషాలు కొనసాగి, భారత పార్లమెంట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంగా గుర్తింపు పొందింది.

కాలక్రమంలో నిర్మలా సీతారామన్ ప్రసంగ శైలిలో మార్పు కనిపించింది. ప్రారంభంలో సుధీర్ఘంగా సాగిన బడ్జెట్ ప్రసంగాలు, తరువాతి సంవత్సరాల్లో.. క్రమంగా సంక్షిప్తంగా మారాయి. 2024 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం 56 నిమిషాల్లో (గంట లోపు) పూర్తయింది. ఇది ఇప్పటివరకు ఆమె చేసిన అత్యంత చిన్న ప్రసంగంగా నిలిచింది. అలాగే 2025 బడ్జెట్ ప్రసంగం కూడా తక్కువ సమయం (74 నిమిషాలు)లోనే పూర్తి కావడం విశేషం.

బడ్జెట్ - ప్రసంగ సమయం
➤2019 బడ్జెట్: 140 నిమిషాలు (2 గంటల 20 నిమిషాలు)
➤2020 బడ్జెట్: 160 నిమిషాలు (2 గంటల 40 నిమిషాలు - అతిపెద్ద బడ్జెట్ ప్రసంగం)
➤2021 బడ్జెట్: 100 నిమిషాలు (1 గంట 40 నిమిషాలు)
➤2022 బడ్జెట్: 91 నిమిషాలు (1 గంట 31 నిమిషాలు)
➤2023 బడ్జెట్: 87 నిమిషాలు (1 గంట 27 నిమిషాలు)
➤2024 ఫిబ్రవరి బడ్జెట్: 56 నిమిషాలు
➤2024 జులై బడ్జెట్: 85 నిమిషాలు (1 గంట 25 నిమిషాలు)
➤2025 బడ్జెట్: 74 నిమిషాలు (1 గంట 14 నిమిషాలు) మొత్తం 8 బడ్జెట్‌లు.. 793 నిమిషాలు / 13 గంటల 13 నిమిషాలు

ఇక 9వ బడ్జెట్‌తో ఆమె మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారు. ఈ బడ్జెట్ ప్రసంగం ఎంత సమయం సాగుతుంది, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు అనే ఆసక్తి దేశవ్యాప్తంగా నెలకొంది. 2026 బడ్జెట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)