Breaking News

ఎస్‌పీఎంసీఐఎల్‌కు త్వరలో నవరత్న హోదా!

Published on Wed, 06/11/2025 - 09:05

సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌పీఎంసీఐఎల్‌) పనితీరు భేషుగ్గా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశంసించారు. త్వరలోనే నవరత్న హోదాను దక్కించుకోగలదని ధీమా వ్యక్తం చేశారు. కరెన్సీ నోట్లు, నాణేల ముద్రణ తదితర కార్యకలాపాలు నిర్వహించే ఎస్‌పీఎంసీఐఎల్‌ కార్పొరేట్‌ ఆఫీసును ప్రారంభించిన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు.

2015లో పునర్‌వ్యవస్థీకరణ అనంతరం 2016–17లో కంపెనీ మొత్తం రుణాన్ని వడ్డీతో సహా చెల్లించేయడంతో పాటు పటిష్టమైన రాబడులు అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగంలో భాగమైన ఈ సంస్థకు ప్రస్తుతం షెడ్యూల్‌ ‘ఏ’ మినీరత్న కేటగిరీ–వన్‌ హోదా ఉంది. లాభాలు, నికర విలువ వంటి ఆర్థిక విషయాలతో పాటు నిర్దిష్ట అర్హతా ప్రమాణాలను బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేంద్రం మహారత్న, నవరత్న, మినీరత్న హోదాలు ఇస్తుంది.

ఇదీ చదవండి: చిన్న ఎగుమతిదార్లకు కేంద్రం చేయూత

2022–23లో ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.534 కోట్లు డివిడెండ్‌ చెల్లించిన కంపెనీ ఆ తర్వాత సంవత్సరంలో (2023–24) రూ.364 కోట్లు అందించింది. 2024–25లో 1,200 కోట్ల బ్యాంక్‌ నోట్లు, 150 కోట్ల నాణేలు, 1.5 కోట్ల పాస్‌పోర్ట్‌ బుక్‌లెట్స్, 700 కోట్ల పైగా ఎక్సైజ్‌ అడ్హెసివ్‌ లేబుల్స్‌ మొదలైనవి కంపెనీ ఉత్పత్తి చేసింది. కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ స్వాధీనం చేసుకున్న పసిడిని శుద్ధి చేయడం ద్వారా 3.4 మెట్రిక్‌ టన్నుల బంగారాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌కి బదలాయించింది. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం, వైష్ణోదేవీ బోర్డు నుంచి వచ్చిన వెండి, బంగారాన్ని కూడా రిఫైన్‌ చేసింది.
 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)