Breaking News

కేంద్ర బడ్జెట్ 2026-27: ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ప్రసంగం..

Published on Sat, 01/31/2026 - 08:14

దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ 2026-27కు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ ప్రభుత్వ మూడో విడత పాలన, అంతర్జాతీయ అనిశ్చితులు, యూఎస్‌ టారిప్‌లు, వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలో ఇది కీలకమైన బడ్జెట్ కావడంతో సామాన్యుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరి కళ్లు ఆర్థిక మంత్రి ప్రసంగంపైనే ఉన్నాయి.

ఆశలు.. ఆకాంక్షలు

ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిత్యావసర ధరల నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఆదాయపు పన్ను మినహాయింపులు, స్టాండర్డ్‌ డిడక్షన్‌ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అటు చిరువ్యాపారులు, ఇటు బడా కార్పొరేట్ సంస్థలు కూడా తమ రంగానికి ఊతమిచ్చేలా ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఈ బడ్జెట్‌తో ఆర్థిక మంత్రి తన తొమ్మిదో బడ్జెట్ ప్రసంగాన్ని సుదీర్ఘ సమయంపాటు చదివి కొత్త రికార్డును సృష్టిస్తారని కొందరు భావిస్తున్నారు.

రికార్డు ప్రసంగాలు

భారత బడ్జెట్ చరిత్రలో ప్రసంగాలకు ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ప్రసంగ సమయంలో కొందరు మంత్రులు కవితలతో ఆకట్టుకుంటే మరికొందరు గంటల తరబడి గణాంకాలతో వివరిస్తారు.

బడ్జెట్ ప్రసంగం నిడివి పరంగా నిర్మలా సీతారామన్ పేరిట రికార్డు ఉంది. 2020 బడ్జెట్‌ సమయంలో ఆమె 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి రికార్డు సృష్టించారు. 2019లో ఆమె నెలకొల్పిన 2 గంటల 19 నిమిషాల రికార్డును ఆమె మళ్లీ తిరగరాశారు. అంతకుముందు ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ (2003లో 2 గంటల 13 నిమిషాలు), అరుణ్ జైట్లీ (2014లో 2 గంటల 10 నిమిషాలు) సుదీర్ఘ ప్రసంగాలు చేశారు.

పదాల పరంగా మన్మోహన్ సింగ్ రికార్డు

ప్రసంగంలోని పదాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మార్చిన 1991 బడ్జెట్ ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి. లైసెన్స్ రాజ్‌ చట్టానికి స్వస్తి పలికి ఆర్థిక సరళీకరణకు బాటలు వేసిన ప్రసంగం ఇది.

సంక్షిప్త ప్రసంగం

1977లో అప్పటి ఆర్థిక మంత్రి హిరూభాయ్ ఎం. పటేల్ కేవలం 800 పదాలతో తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. ఇది భారత చరిత్రలోనే అతి తక్కువ నిడివి గల ప్రసంగం. 2024 మధ్యంతర బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ కేవలం 60 నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించి తన శైలికి భిన్నంగా వ్యవహరించారు.

ఈసారి ఏం జరగబోతోంది?

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును స్థిరంగా ఉంచుతూనే సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చే నిర్ణయాలను నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రసంగంతో అన్ని ఊహాగానాలకు తెరపడనుంది.

ఇదీ చదవండి: సీనియర్ సిటిజన్లకు తీపి కబురు?

Videos

అక్రమంగా భూములు తీసుకోవడమే కాదు.. GVMC కౌన్సెల్ గోడపై YSRCP నేతలు ఫైర్

నయనతార మూవీ లైనప్ .! బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే

USA: నో వర్క్ .. నో స్కూల్ .. నో షాపింగ్

Chelluboyina: లడ్డూ కల్తీ కాదు.. చంద్రబాబే పెద్ద కల్తీ

అంబటిపై దాడి YSRCP శ్రేణుల ఆగ్రహం

Srinivas: నువ్వు సీఎంగా ఉన్నప్పుడు తీసిన శాంపిల్స్ లోనే

నితిన్ వదులుకున్నవి అన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలే..!

Margani : తిరుపతి ప్రెస్టేజ్ పోయింది YSRCP పాప ప్రక్షాళన పూజలు

అమెరికాలో మరోసారి షట్ డౌన్..

అరవ శ్రీధర్‌ మరో రెండు వీడియోలు రిలీజ్

Photos

+5

తిరుమల శ్రీవారిలో సేవలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫ్యామిలీ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ సక్సెస్ మీట్ లో మెరిసిన మీనాక్షి చౌదరి (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ సోనమ్ కపూర్ (ఫొటోలు)

+5

'కన్నప్ప' ఫేమ్ ప్రీతి ముకుందన్ గ్లామర్ (ఫొటోలు)

+5

వైభవంగా మేడారం మహా జాతర.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

సందడిగా వింగ్స్‌ ఇండియా..బేగంపేటలో ఆకట్టుకుంటున్న వైమానిక విన్యాసాలు (ఫొటోలు)

+5

నగరంలో సందడి చేసిన మహేష్ బాబు కూతురు సితార (ఫొటోలు)

+5

నారింజలా మెరిసిపోతున్న శోభాశెట్టి (ఫొటోలు)

+5

అనస్వర రాజన్ మూవీ విత్ లవ్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)