Breaking News

24,000 దిగువకు నిఫ్టీ

Published on Wed, 11/13/2024 - 01:12

ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలతో స్టాక్‌ సూచీలు మంగళవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. దేశీయ అక్టోబర్‌ ద్రవ్యల్బోణ, సెపె్టంబర్‌ పారిశ్రామికోత్పత్తి గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి విలువ రోజుకో కొత్త కనిష్టానికి దిగిరావడమూ ఒత్తిడి పెంచింది. ఫలితంగా సెన్సెక్స్‌ 821 పాయింట్లు నష్టపోయి 79 వేల దిగువన 78,675 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 258 పాయింట్లు క్షీణించి 24 వేల దిగువన  23,883 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన స్టాక్‌ సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. రియలీ్ట, ఐటీ మినహా అన్ని రంగాల్లో విక్రయాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా బ్యాంకులు, ఆటో, విద్యుత్‌ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 948 పాయింట్లు క్షీణించి 78,548 వద్ద, నిఫ్టీ 302 పాయింట్లు కోల్పోయి 23,839 వద్ద కనిష్టాలు తాకాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 1.25%, 1% నష్టపోయాయి. సెమికండక్టర్ల షేర్లతో పాటు చైనా మార్కెట్‌ వరుస పతనంతో ఆసియా మార్కెట్లు 3% పడ్డాయి. యూరప్‌ మార్కెట్లు 1.5% క్షీణించాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. 

⇒ అధిక వెయిటేజీ షేర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 3%, ఎస్‌బీఐ 2.50%, ఏషియన్‌ పెయింట్స్‌ 2%, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్‌ 1% నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి.
⇒ అధిక వాల్యుయేషన్ల ఆందోళలనల తో ప్రభుత్వరంగ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐటీఐ 10% పతనమైంది. హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్, గెయిల్‌ 4.50%, భెల్, ఎన్‌ఎల్‌సీ 4%, ఎన్‌సీఎల్‌ 3.50% క్షీణించాయి. 

⇒ బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌  విలువ మంగళవారం ఒక్కరోజే రూ.5.29 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.437.24 లక్షల కోట్లకు తగ్గింది.  
⇒ సాగిలిటీ ఇండియా లిస్టింగ్‌ నిరాశపరిచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.30)తో పోలిస్తే 3.50% ప్రీమియంతో రూ.31 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 10% పెరిగి, చివరికి 2% నష్టంతో రూ.29.36 వద్ద ముగిసింది. 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)