Breaking News

ఒక్క కఠిన నిర్ణయం.. నెట్‌ఫ్లిక్స్‌కు రికార్డ్‌ లాభాలు!

Published on Sun, 04/14/2024 - 11:47

ప్రముఖ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ తీసుకున్న ఒక్క కఠిన నిర్ణయంతో దాని లాభాలు అమాంతం పెరగనున్నాయి. ‘వన్‌ డే’ పాపులర్ షో విడుదల, పాస్‌వర్డ్ షేరింగ్‌ కట్టడి  చర్యల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ లాభాలు కొత్త రికార్డును తాకనున్నాయి.

వాల్ స్ట్రీట్ అంచనాల ప్రకారం.. ఈ స్ట్రీమింగ్ దిగ్గజం ఈ సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో 4.7 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లను సాధించింది. 2020 కోవిడ్‌ లాక్‌డౌన్‌ల తర్వాత సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య పెరుగుదల ఇదే అత్యధికం. అయితే నెట్‌ఫ్లిక్స్‌ ఈ స్థాయిలో పుంజుకోవడానికి పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను కట్టడి చేయడమే కారణంగా తెలుస్తోంది.

అయితే 2022లో ప్రకటనలతో కూడిన చౌకైన నెలవారీ చెల్లింపు ప్లాన్‌ను ప్రవేశపెట్టినప్పటి నుండి నెట్‌ఫ్లిక్స్‌కు యూజర్ల సంఖ్య పెరిగింది. రీఫినిటివ్‌ (Refinitiv) డేటా ప్రకారం.. నెట్‌ఫ్లిక్స్‌ లాభాలు 50 శాతం కంటే ఎక్కువ పెరిగి దాదాపు రూ. 16 వేల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. కంపెనీకి సంబంధించి ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా మొదటి త్రైమాసికంలో ఇవే అత్యధిక లాభాలు కానున్నాయి. 

ఇది డిస్నీ, అమెజాన్, యాపిల్ వంటి దిగ్గజాలతో స్ట్రీమింగ్ వార్‌లో నెట్‌ఫ్లిక్స్‌ను దృఢంగా నెలబెట్టనుంది. నెట్‌ఫ్లిక్స్‌ ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్‌కు 20 కోట్ల మంది, డిస్నీ+కి 15 కోట్ల మంది యూజర్లు  ఉన్నారు.

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)