amp pages | Sakshi

నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు భారీ షాక్‌!

Published on Wed, 05/24/2023 - 16:41

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లకు భారీ షాకిచ్చింది. పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో అమెరికాతో పాటు ప్రపంచంలోని 100 దేశాల్లో నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లు వారి అకౌంట్లను కుటుంబసభ్యులకు, స్నేహితులకు ఉచితంగా షేర్‌ చేసే అవకాశాన్ని కోల్పోనున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తుంది. ఇందులో భాగంగా పాస్‌ వర్డ్‌ షేరింగ్‌పై అదనపు ఛార్జీలు, యాడ్‌ సపోర్ట్‌ ఆప్షన్‌ వంటి ఫీచర్లను ఎనేబుల్‌ చేసింది.

103 దేశాల యూజర్లకు ఇ-మెయిల్స్‌
నెట్‌ఫ్లిక్స్‌ మంగళవారం అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్‌, మెక్సికో, బ్రెజిల్‌ పాటు  పాస్ వర్డ్‌ షేరింగ్‌పై అదనపు ఛార్జీల్ని వసూలు చేస్తున్నట్లు 103 దేశాలు, కేంద్ర పాలిత ప్రాంతాల యూజర్లకు మెయిల్‌ పెట్టింది. ఆ ఇ-మెయిల్స్‌లో నెట్‌ఫ్లిక్స్‌ యూజర్లు ఒక అకౌంట్‌ను ఒకరే వినియోగించుకోవాలని, ఇతరులకు షేర్‌ చేస్తే అమెరికా యూజర్లు అదనపు ఛార్జీల కింద 8 డాలర్లను (భారత​ కరెన్సీలో రూ.700డాలర్లు) విధిస్తున్నట్లు పేర్కొంది. 

100 మిలియన్లకు పైగా 
100 మిలియన్లకు పైగా కుటుంబాలు తమ లాగ్-ఇన్ వివరాలు ఇతర కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్‌ చేసినట్లు కంపెనీ అంచనా వేసింది. కాగా, మార్చి చివరి నాటికి, నెట్‌ఫ్లిక్స్ చెల్లింపు కస్టమర్లు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 232.5 మిలియన్లు సబ్‌స్క్రిప్షన్‌ యూజర్లు ఉన్నారు. కొత్త పాలసీల ప్రకారం, ఒకే కుటుంబ సభ్యులు నెట్‌ఫ్లిక్స్ ఖాతాను వీక్షించవచ్చు. ప్రయాణంలో ఇతర డివైజ్‌లలో లాగిన్‌ అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

చదవండి👉 భారత్‌లో టెస్లా.. త్వరలో కార్ల తయారీ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటాం!

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)