Breaking News

ఏఐ ఎఫెక్ట్స్‌తో తొలిసారి ఒరిజినల్ టీవీ షో

Published on Fri, 07/18/2025 - 20:35

కృత్రిమ మేధ (ఏఐ) సృష్టించిన విజువల్ ఎఫెక్ట్స్‌ను తొలిసారిగా ఒరిజినల్ టీవీ షోలో ఉపయోగించినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ప్రాంప్ట్స్ ఆధారంగా వీడియోలు, చిత్రాలను రూపొందించే ఏఐని అర్జెంటీనా సైన్స్ ఫిక్షన్ షో ‘ది ఎటర్నాట్’లో భవనం కూలిపోయే సన్నివేశాన్ని సృష్టించడానికి ఉపయోగించినట్లు కంపెనీ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ టెడ్ సారాండోస్ తెలిపారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల నిర్మాణ బృందం వేగంగా, తక్కువ ఖర్చుతో సన్నివేశాలను పూర్తి చేయగలిగిందని చెప్పారు.

జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమలో వివాదాస్పదంగా ఉంది. ఇది ఇతరుల పనిని వారి అనుమతి లేకుండా ఉపయోగించి కంటెంట్‌ సృష్టిస్తుందనే ఆందోళనలు రేకెత్తిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం గురించి సారాండోస్ మాట్లాడుతూ.. ఈ సాంకేతికత చిన్న బడ్జెట్ ఉన్న నిర్మాణాలకు అధునాతన విజువల్ ఎఫెక్స్ట్‌ ఉపయోగించడానికి అనుమతించినట్లు చెప్పారు. బ్యూనస్ ఎయిర్స్‌లో ఒక భవనం కూలిన క్రమాన్ని సంప్రదాయ స్పెషల్ ఎఫెక్ట్స్ టూల్స్ ఉపయోగించిన దానికంటే 10 రెట్లు వేగంగా పూర్తి చేయడానికి ఎటెర్నాట్‌లో ఉపయోగించిన జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమ బృందానికి సహాయపడిందని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి: ఫేస్‌బుక్‌పై రూ.68 వేలకోట్ల దావా

దక్షిణ కొరియా థ్రిల్లర్ స్క్విడ్ గేమ్ మూడో, చివరి సిరీస్ విజయం సాధించడంతో ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబరిచినట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. ఇది ఇప్పటివరకు 122 మిలియన్ వ్యూస్‌ సాధించిందని సారాండోస్‌ అన్నారు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే జూన్ నెలాఖరు వరకు మూడు నెలల్లో నెట్‌ఫ్లిక్స్‌ ఆదాయం 16 శాతం పెరిగి 11 బిలియన్ డాలర్లకు (8.25 బిలియన్ పౌండ్లు) చేరుకున్నట్లు ప్రకటించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లాభాలు 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.1 బిలియన్ డాలర్లకు పెరిగాయి.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)