Breaking News

అప్పట్లో వారి కోసం మా జీతాలు భారీగా తగ్గించుకున్నాం: ఇన్ఫీ నారాయణమూర్తి

Published on Fri, 03/03/2023 - 15:51

ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్‌ సహా అనేక టెక్ కంపెనీలు గత కొన్ని నెలలుగా  ఫ్రెషర్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి 2001 నాటి గడ్డు పరిస్థితి తాము ఎలా ఎదుర్కొన్నదీ, ఫ్రెషర్లను ఆన్‌బోర్డింగ్‌ చేయడానికి ఏం చేసిందీ తెలియజేశారు. 

ఆ సమయంలో తమ కంపెనీ దాదాపు 1,500 మంది ఫ్రెషర్లకు ఆఫర్లు ఇచ్చిందని మూర్తి చెప్పారు. కానీ పరిస్థితి ప్రతికూలంగా మారడంతో ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్ల ప్రకారం వారిని ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు కంపెనీలో పైస్థాయిలో తామంతా భారీగా జీతాలు తగ్గించుకున్నట్లు మనీ కంట్రోల్‌ వార్తా సంస్థకు వివరించారు. అప్పట్లో బోర్డు డైరెక్టర్లు అంతా కూర్చుని మాట్లాడుకుని ఈ నిర్ణయం తీసుకుని ఆ 1500 మంది ఫ్రెషర్లను అనుకున్నట్లుగా ఆన్‌బోర్డింగ్‌ చేయగలిగామని గుర్తు చేసుకున్నారు. అలా చేసిన ఏకైక సంస్థ ఇన్ఫోసిస్‌ అని,  ఈ చర్య పట్ల తాను చాలా గర్విస్తున్నానని మూర్తి అన్నారు.

కృత్రిమ మేధతో ముప్పు లేదు
చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ (AI) సాధనాలు మానవ ఉద్యోగాలపై ప్రభావం చూపవని నారాయణమూర్తి అన్నారు. 1977-78లో  కూడా ‘ప్రోగ్రామ్ జనరేటర్’ ఆవిర్భావం సందర్భంగా ఇటువంటి ఆందోళనలు వ్యక్తమయ్యాయని గుర్తు చేశారు. చాట్‌జీపీటీ వంటివి కోడర్‌(ఉద్యోగి)పై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. మానవ మేధస్సు అత్యంత శక్తివంతమైనదని, దేన్ని అయినా తనకు అనువుగా మలుచుకోగలదని చెప్పారు. మానవులు ఈ కృత్రిమ మేధ సాధనాలను సృజనాత్మకంగా, తెలివిగా వాడుకోగలరని ఆయన పేర్కొన్నారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)