Breaking News

టాటా గ్రూప్‌లో కీలక పరిణామం: చైర్మన్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా

Published on Thu, 05/29/2025 - 14:45

దిగ్గజ వ్యాపార సంస్థ టాటా గ్రూప్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ 'ఎన్ చంద్రశేఖరన్' టాటా కెమికల్స్ డైరెక్టర్ అండ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పకున్నారు. బుధవారం ఈ విషయాన్ని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్స్‌లో కంపెనీ వెల్లడించింది.

"నా ప్రస్తుత.. భవిష్యత్తు నిబద్ధతలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, నేను బోర్డు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. టాటా కెమికల్స్ బోర్డుకు అధ్యక్షత వహించడం గౌరవంగా ఉంది. అంతే కాకుండా నా పదవీకాలంలో నాకు మద్దతు.. సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు'' అంటూ.. టాటా సన్స్ చైర్మన్ మే 28న కంపెనీ డైరెక్టర్ల బోర్డును ఉద్దేశించి ప్రసంగించారు.

ఎన్ చంద్రశేఖరన్ పదవి నుంచి వైదొలిగిన తరువాత.. 2025 మే 30 నుంచి 'ఎస్. పద్మనాభన్‌' కొత్త చైర్మన్ బాధ్యతలను తీసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే.. నామినేషన్, వేతన కమిటీ సిఫార్సుల ఆధారంగా, మే 28, 2025 నుంచి అమలులోకి వచ్చేలా 'మోదన్ సాహా'ను అదనపు డైరెక్టర్ (నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్)గా నియమించడానికి బోర్డు ఆమోదం తెలిపింది.

ఎవరీ ఎన్ చంద్రశేఖరన్?
తమిళనాడులోని నామక్కల్‌లోని మోహనూర్‌లోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఎన్ చంద్రశేఖరన్..  ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసి, తరువాత కోయంబత్తూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అప్లైడ్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆ తరువాత తిరుచిరాపల్లిలోని రీజినల్ ఇంజనీరింగ్ కళాశాలలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) డిగ్రీని పూర్తిచేశారు.

ఇదీ చదవండి: 'ధనవంతులవ్వడం చాలా సులభం': రాబర్ట్ కియోసాకి

టాటా గ్రూప్‌తో ఆయన ప్రయాణం 1987లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో ఇంటర్న్‌గా చేరడంతో ప్రారంభమైంది. సెప్టెంబర్ 2007లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) స్థాయికి త్వరగా ఎదిగారు. అక్టోబర్ 2009లో, కేవలం 46 సంవత్సరాల వయసులో టీసీఎస్ సీఈఓగా నియమితులయ్యారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)