కొత్త కారు కొనేవారికే కష్టమే! జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణయంతో..

Published on Wed, 07/12/2023 - 17:33

సాధారణంగా ఎప్పటికప్పుడు వాహన తయారీ సంస్థలు తన ఉత్పత్తుల ధరలను పెంచుతూనే ఉంటాయి. ముడిసరుకుల ధరల కారణంగా.. ఇతరత్రా కారణాలు చూపిస్తూ ఏడాదికి కనీసం ఒక్క సారైనా పెంచుతుందన్న విషయం అందరికి తెలిసిందే. కాగా తాజాగా జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో మల్టీ యుటిలిటీ వెహికల్స్ (MUV), క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్స్ (XUV) ధరలు పెరిగినట్లు స్పష్టంగా తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మంగళవారం జరిగిన 50వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త కారు కొనాలనుకునే వారికి జీఎస్‌టీ కౌన్సిల్ పెద్ద షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల మీద జీఎస్‌టీ సెస్ పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కావున ఇప్పుడు కొత్త ఎమ్‌యూవీ కార్లను కొనుగోలు చేసేవారు ఎక్కువ ధరలు చెల్లించాల్సి వస్తుందని తెలుస్తోంది. 28 శాతం జీఎస్‌టీ ఉండగా.. దీనిపైన 22 శాతం సెస్ విధించారు. దీంతో వాహన ధరలకు రెక్కలొచ్చాయి.

(ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!)

ఎస్‌యూవీ అంటే పొడవు 4 మీటర్ల కంటే ఎక్కువ ఉండటమే కాకుండా.. ఇంజిన్ కెపాసిటీ 1500 సీసీ కంటే ఎక్కువ ఉండాలి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 170 మీమీ కంటే ఎక్కువ ఉండాలి. ఇవన్నీ ఉన్న కార్లు మాత్రమే ధరల పెరుగుదల అందుకుంటాయని తెలుస్తోంది. గతంలో సెస్ అనేది 20 శాతంగా ఉండేది. ఇది తాజాగా రెండు శాతం పెరిగి సెస్ 22 శాతానికి చేరింది. ధరల పెరుగుదల సామాన్య ప్రజల మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నాము.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)