Breaking News

రక్షణ ప్లస్‌ రాబడి

Published on Mon, 03/23/2026 - 05:31

మన దేశంలో ఇన్వెస్ట్‌మెంట్లంటే మొదటి నుంచీ ఒకటే ధోరణి. అయితే డిపాజిట్లు. లేకుంటే స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు. ఇవి రెండూ కాకుంటే బంగారం లేదా రియలీ్ట. స్టాక్‌ మార్కెట్లో నేరుగా పెట్టుబడులు పెట్టడం ఇబ్బందికరం అనుకునేవారు మ్యూచువల్‌ ఫండ్లను ఆశ్రయించటం. ఇప్పటికీ చాలామందిది ఇదే తీరు. వారికి మ్యూచువల్‌ ఫండ్లంటే స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవే. కానీ ఇప్పుడు మార్కెట్లు ఇలా వేటిలోనూ ఒకదాంట్లో పెట్టుబడులు పెట్టి ఊరుకునేలా లేవు. అలాగని అన్నింట్లోనూ పెట్టుబడులు పెట్టాలంటే... వాటిని గమనిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను బట్టి మార్చుకోవటం అంత తేలికకాదు. అందుకే ఇలాంటివన్నీ చేసే ఫండ్స్‌ను చూసుకోవాలి. 

అటు డెట్‌లోను, ఇటు స్టాక్‌ మార్కెట్లో, మరోవైపు బంగారంలోనూ... ఇలా మూడింటా పెట్టుబడులు పెడుతూ... అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ముందుకెళ్లేవే మల్టీ అసెట్‌ ఫండ్స్‌. పేరుకు తగ్గట్టే ఇవి భిన్న రకాల ఆస్తుల్లో పెట్టుబడులు పెడుతూ ఉంటాయి. డెట్‌లో పెడతాయి కనక కొంత రక్షణ తప్పనిసరిగా ఉంటుంది. పైపెచ్చు అవసరాన్ని బట్టి మారుస్తాయి కనక చక్కని రాబడి కూడా ఇస్తున్నాయి. రిస్క్ లు, రాబడుల మధ్య సమతూకాన్ని పాటిస్తూ వివిధ అసెట్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న ఈ మల్టీ అసెట్‌ ఫండ్స్‌... ప్రస్తుతం అందరికీ అవసరమైనవనటంలో సందేహం లేదు. వాటిపై సమగ్ర అవగాహనే ఈ వెల్త్‌ స్టోరీ...

కనీసం మూడు అసెట్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌నే మల్టీ అసెట్‌ ఫండ్స్‌గా వ్యవహరిస్తుంటారు. ఇవి పెట్టుబడి వృద్ధి కోసం ఈక్విటీల్లో, స్థిరత్వం కోసం డెట్‌ సాధనాలు– బాండ్స్‌లో, రిస్క్ లను హెడ్జ్‌ చేసేందుకు పసిడి/ కమోడిటీల్లో ఇన్వెస్ట్‌ చేస్తాయి. ప్రతి అసెట్‌ క్లాస్‌కి కనీసం ఇంత కేటాయించాలనే నిబంధనలుంటాయి. కాబట్టి దానికి తగ్గట్లే ఈ ఫండ్స్‌ ఇన్వెస్ట్‌ చేస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇలాంటి ఫండ్‌ ఒకటి ఉంటే సంపూర్ణమైన పోర్ట్‌ఫోలియో ఉన్నట్లే లెక్క.  

ఇవన్నీ ఎందుకు ప్రాచుర్యం పొందుతున్నాయి.. 
ప్రస్తుతం మార్కెట్లను చూస్తే విడివిడిగా స్టాక్స్‌ని ఎంచుకోవడం కన్నా అసెట్స్‌ అలొకేషన్‌ వైపే పరిస్థితులు మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ఈక్విటీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. డెట్‌ మార్కెట్లు స్థిరపడుతున్నాయి. పుత్తడి పటిష్టమైన హెడ్జింగ్‌కి ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో ఏదో ఒక్క అసెట్‌ని నమ్ముకుంటే వర్కౌట్‌ కాదని ఇన్వెస్టర్లు గ్రహిస్తున్నారు. మల్టీ అసెట్‌ ఫండ్స్‌తో ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా అందుకుంటున్నారు. ఇవి పరిస్థితులను బట్టి వివిధ అసెట్స్‌ మధ్య కేటాయింపులను ఆటోమేటిక్‌గా మార్చేస్తాయి. మార్కెట్లలో మార్పులను బట్టి అవకాశాలను అందిపుచ్చుకుంటాయి. పోర్ట్‌ఫోలియో పతనమయ్యే రిస్కులను తగ్గిస్తాయి.  

మల్టీ అసెట్‌ ఎందుకు ఉపయోగకరం అంటే..
వివిధ అసెట్స్‌ వ్యాప్తంగా పెట్టుబడులను డైవర్సిఫై చేసేందుకు వీలుంటుంది. పరిస్థితులను బట్టి పోర్ట్‌ఫోలియో ఆటోమేటిక్‌గా రీబ్యాలెన్స్‌ అవుతుంది. ఈక్విటీల్లో మాత్రమే పెట్టే పెట్టుబడులతో పోలిస్తే హెచ్చుతగ్గులు తక్కువగా ఉంటాయి. వీటిలోనైతే మార్కెట్‌ కరెక్షన్లకు లోనయ్యేటప్పుడు రక్షణ ఉంటుంది. దీర్ఘకాలికంగా సిప్‌ ఇన్వెస్టింగ్‌ కోసం ఇవి అనువైనవి కూడా.

డెట్‌ (బాండ్లు) పాత్ర.. 
డెట్‌ విభాగమనేది మల్టీ అసెట్‌ ఫండ్స్‌కి ఉండే బలాల్లో ఒకటి. ఇది స్థిరమైన రాబడిని అందిస్తుంది. పోర్ట్‌ఫోలియోలో ఒడిదుడుకులను తగ్గిస్తుంది. ఈక్విటీలు కరెక్షన్‌కి లోనయ్యే సమయంలో పోర్ట్‌ఫోలియో మరీ ఎక్కువగా పడిపోకుండా కాస్త కుషన్‌గా పని చేస్తుంది. మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు బాండ్లు అనేవి భద్రత కోసమే కాక పోర్ట్‌ఫోలియోను సంరక్షించుకునే వ్యూహంగా కూడా పనికొస్తాయి.  

సరైన ఫండ్‌ని ఎంచుకోవడం ఇలా.. 
అసెట్‌ అలొకేషన్‌ని పరిశీలించాలి 
→ ఈక్విటీలవైపు ఎక్కువగా మొగ్గు చూపించే ఫండ్లలో అధిక రాబడులతో పాటు అధిక రిస్క్ లూ ఉంటాయి.  
→ బ్యాలెన్స్‌డ్‌గా పెట్టుబడులు పెట్టే ఫండ్లలో మాత్రమే స్థిరమైన రాబడులుంటాయి.  

నిలకడపై ఫోకస్‌ 
→ స్వల్పకాలిక రాబడులను కాకుండా 3–5 ఏళ్ల పనితీరును పరిశీలించాలి. ఫండ్‌ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి 
→ ఐసీఐసీఐ = కాంట్రేరియన్‌ 
→ ఎస్‌బీఐ = బ్యాలెన్స్‌డ్‌ 
→ క్వాంట్‌ = అగ్రెసివ్‌  మీ రిస్కు సామర్థ్యాలను బట్టి అనువైనవి ఎంచుకోవాలి
→ కన్జర్వేటివ్‌ = ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ 
→ మోడరేట్‌ = ఐసీఐసీఐ, కోటక్‌ 
→ అగ్రెసివ్‌ = నిప్పన్, క్వాంట్‌  

ఈ రిస్క్ లుంటాయ్‌.. 
మార్కెట్లు బులిష్గా దూకుడు మీదున్నప్పుడు ఇవి పెద్దగా రాణించకపోవచ్చు. అలాగే రాబడులనేవి ఫండ్‌ మేనేజర్‌ నిర్ణయాలను బట్టి ఆధారపడి ఉంటాయి. ఇక మరీ డైవర్సిఫికేషన్‌ ఎక్కువగా చేసినా కూడా వృద్ధి అవకాశాలు పరిమితమవుతాయి.

– సాక్షి, వెల్త్‌

Videos

మొత్తం బరితెగించి పోయారు.. తిరుపతి ప్రతిష్టను చంద్రబాబు మంట కలిపారు..

కుప్ప కూలుతున్న బంగారం ధరలు.. భవిష్యత్లో బంగారం లక్షకు పడిపోనుందా..?

లండన్ లో దారుణం.. ముసుగు ధరించి యూదుల అంబులెన్స్ లకు నిప్పు

నా రెండు కాళ్లు విడదీసి.. మిస్టర్ పెమ్మసాని.. గుర్తుపెట్టుకో..

మళ్ళీ ట్రాక్ తప్పుతోన్న ప్రభాస్..

లంచం తీసుకుంటూ దొరికిన లాజిస్టిక్స్ మేనేజర్

మల్లారెడ్డి.. కబడ్డీ, కబడ్డీ

పొరపాటున ఊర్లోకెళితే.. కోడిగుడ్లు, రాళ్లతో ఉరికించి కొడతారు..

రంగస్థలం 2 కి రంగం సిద్ధం

ఉద్యోగులకు కొత్త రూల్స్.. తల్లిదండ్రులను చూసుకోకపోతే జీతం కట్!

Photos

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

విజయవాడ : సమ్మోహనం.. ఆంధ్ర నాట్యం (ఫొటోలు)

+5

శర్వానంద్ 'బైకర్' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)

+5

మోడర్న్‌ లెహంగాలో ముద్దమందారంలా మిల్కీబ్యూటీ.. (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 22-29)

+5

ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి (ఫోటోలు)

+5

సంగీత సంబరం.. ట్రాఫిక్‌ సంకటం (ఫోటోలు)

+5

Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)