Breaking News

అయోధ్య రాముడికి అంబానీ దంపతుల కానుక.. 33 కేజీల బంగారం?

Published on Mon, 01/22/2024 - 16:02

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఎట్టకేలకు ముగిసింది. ఈ దివ్య ఘట్టాన్ని ప్రత్యక్షంగా తిలకించిన ప్రముఖలతోపాటు టీవీల్లో, ఇతర సాధనాల్లో వీక్షించిన కోట్లాదిమంది భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్‌ అంబానీ కుటుంబం కూడా ఈ వేడుకలో పాల్గొంది.

కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు అయోధ్యలోని రామమందిరానికి 33 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు ముందు నుంచే ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 33 కేజీల బంగారంతో పాటు అంబానీలు ఆలయానికి మూడు బంగారు కిరీటాలను కూడా విరాళంగా ఇచ్చారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇదీ చదవండి: Ayodhya: అమ్మతో అయోధ్యలో.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీ సీఈవో భక్తిపారవశ్యం! 

ఈ వార్తలు నిజమేనా?
అయోధ్య రామమందిరానికి ముఖేష్ అంబానీ దంపతులు మూడు బంగారు కిరీటాలు, 33 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు వచ్చిన ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. డీఎన్‌ఏ వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. విరాళాల విషయమై న్యూస్‌చెకర్‌ (Newschecker) వెబ్‌సైట్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యునితో మాట్లాడింది. ఇలాంటి విరాళాలేవీ తమకు అందించలేదని ట్రస్ట్‌ సభ్యులు ధ్రువీకరించినట్లుగా పేర్కొంది.

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు