Breaking News

రూ.4000 కోట్ల పెట్టుబడికి సిద్దమైన అంబానీ.. పెద్ద ప్లానే ఇది!

Published on Tue, 01/16/2024 - 07:15

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఎప్పటికప్పుడు తన వ్యాపారా సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన జియో సేవలను పొరుగుదేశమైన శ్రీలంకలో కూడా ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.

ఆర్థిక సంక్షోభం మధ్య ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి అధికారులు ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో శ్రీలంక టెలికాం పిఎల్‌సిలో వాటాను రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్‌ అంబానీ కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు.

శ్రీలంక టెలికాం పీఎల్‌సీలో వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్న మొదటి మూడు కంపెనీలలో అంబానీ జియో ప్లాట్‌ఫామ్‌ కూడా ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం ఇటీవలే పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం పీఎల్‌సీ మార్కెట్ విలువ రూ.4000 కోట్లుగా ఉన్నట్లు సమాచారం.

శ్రీలంక టెలికాం పీఎల్‌సీ సంస్థను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిన కంపెనీల జాబితాలో జియో మాత్రమే కాకుండా.. గోర్ట్యూన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్ లిమిటెడ్, పెట్టిగో కమర్సియో ఇంటర్నేషనల్ ఎల్‌డిఎ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీ ఎవరి హస్తగతం అవుతుందనేది త్వరలోనే తెలుస్తుంది.

ఇండియాలో జియో ప్లాట్‌ఫారమ్‌
భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే సంచలనం సృష్టించిన జియో 2023 అక్టోబర్ నాటికి 31.59 లక్షల వినియోగదారులను కలిగి ఉన్నట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) విడుదల చేసిన తాజా గణాంకాల ద్వారా తెలిసింది. ఈ సంఖ్య దాని ప్రత్యర్థి భారతీ ఎయిర్‌టెల్ కంటే కూడా ఎక్కువని స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: భయాన్ని ఎదుర్కోండి.. వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

గత వారం గాంధీనగర్‌లో జరిగిన వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్ 2024లో ముఖేష్ అంబానీ పెట్టుబడి ప్రకటనల తర్వాత రిలయన్స్ అండ్ జియో షేర్లు స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలను పొందాయి. షేర్లలో పెరుగుదల ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తి స్థానాన్ని తిరిగి పొందేందుకు దారితీసింది. దీంతో మళ్ళీ భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా ముకేశ్ అంబానీ నిలిచారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)