Breaking News

ముకేశ్‌ అంబానీ 40వ పెళ్లి రోజు.. బంగారు రంగు కేక్‌.. దానిపై అన్నీ అవే!

Published on Mon, 03/17/2025 - 13:28

భారతీయ కుబేరుడు, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ.. ఈ నెలలో తన భార్య నీతా అంబానీతో 40వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీరి ఓ ప్రత్యేకమైన కేక్ తయారు చేశారు. 30 కేజీల బరువున్న ఈ కేక్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ప్రత్యేకమైన కేక్ చూడవచ్చు. ఈ కేక్ మీద సింహాలు, జిరాఫీలు, ఏనుగులు, మొసళ్ళు వంటి వివిధ జంతువుల ఆకారాలు బంగారు రంగులో ఉండటం చూడవచ్చు. జామ్‌నగర్‌లోని జంతు సంరక్షణ, పునరావాస కేంద్రమయిన వంతారాను ప్రేరణగా తీసుకుని ఈ కేక్ మీద జంతువుల బొమ్మలు చిత్రించారు.

కేక్ మధ్యలో నీతా, ముకేశ్ అంబానీల మొదటి అక్షరాలు ఉన్నాయి. పై భాగంలో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ఉండటం చూడవచ్చు. దీనిని ముంబైలోని ప్రముఖ బేకరీ డెలిసియాను నడుపుతున్న బంటీ మహాజన్ తయారు చేశారు.

వంతారా
అనంత్‌ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)